రామ్‌ చరణ్‌ కథలు వినే మూడ్‌ లో కూడా లేడట

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తర్వాత చేయబోతున్న సినిమా ఏంటీ అనే విషయంపై క్లారిటీ రాలేదు.ఆచార్య చిత్రంలో ఆయన చిన్న రోల్‌ చేయబోతున్న విషయం తెల్సిందే.

 Ramcharan Spen The Time With Upasana, Ramcharan, Upasana, Rrr, Acharya, Trivikra-TeluguStop.com

అంతకు మించి కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ అయితే లేదు.చాలా మంది దర్శకులతో ఈయన చేయబోతున్నట్లుగా వార్తలు అయితే వచ్చాయి.

కాని ఇప్పటి వరకు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.ఇటీవల ఒక యువ దర్శకుడు కథ చెప్పేందుకు ప్రయత్నించగా ప్రస్తుతానికి ఇంట్రెస్ట్‌ లేదు అంటూ తప్పించుకున్నాడట.

కథలు వినేందుకు ఆసక్తి చూపించక పోవడం పై సినీ జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ ఎందుకు అలా అన్నాడా అంటూ చర్చించుకుంటున్నారు.ఇప్పటికే కథ ఓకే చెప్పి ఉంటాడు కనుక కొత్త కథలు వినేందుకు ఆసక్తి చూపడం లేదని మూడ్‌ లేకపోయి ఉంటుందని అంటున్నారు.ప్రస్తుతం రామ్‌ చరణ్‌ పూర్తిగా సమయంను ఇంటికే కేటాయిస్తున్నాడు.

ఉపాసనతో ఎక్కువ టైం స్పెండ్‌ చేస్తూ జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Acharya, Ramcharan, Trivikram, Upasana, Young-

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ ఇప్పటికే త్రివిక్రమ్‌తో మూవీ కన్ఫర్మ్‌ చేశాడు.అది కాకుండా కేజీఎఫ్‌ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో కూడా సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.ఇలా వరుసగా మూడు నాలుగు సినిమాలకు ఎన్టీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి ఉన్నాడు.

కాని చరణ్‌ విషయంలో మాత్రం కాస్త కన్ఫ్యూజన్‌ ఉంది.అందుకే ఇండస్ట్రీ వర్గాల్లో అనేక రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

చరణ్‌ కొత్త సినిమా ప్రకటన వచ్చే వరకు ఇలాంటి పుకార్లు అనేవి కామన్‌గా వస్తూనే ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube