టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అతి చిన్న వయసులోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను అందుకుంది.తెలుగుతో పాటు హిందీ, కన్నడ సినిమాలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.
ఇక తన గ్లామర్ తో యువతను కన్నార్పకుండా చేస్తుంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోలతో, వీడియోలతో హల్ చల్ చేస్తుంది.
ఇదిలా ఉంటే అడవిలో షూటింగ్ గురించి ఓ కామెంట్ చేసింది.
కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ కెరటం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో బాగా దూసుకెళ్లింది.ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉండగా ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీని దూరం పెట్టి బాలీవుడ్ లో అడుగులు వేసింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో థాంక్ గాడ్, మే డే, డాక్టర్ జి అనే సినిమాలలో నటిస్తుంది.అంతేకాకుండా అక్షయ్ కుమార్ నటించనున్న సినిమాలో కూడా అవకాశం అందుకుంది ఈ బ్యూటీ.

లేడీ డైరెక్టర్ అనుభూతి కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా డాక్టర్ జిఈ సినిమాలో రకుల్ ప్రీత్ ఫాతిమా పాత్రలో వైద్య విద్యార్థిని గా కనిపించనుంది.ఇక ఆయుష్మాన్ ఉదయ్ గుప్తా పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉండగా.ఈ సినిమా షూటింగ్ భూపాల్ లో అడవి ప్రాంతంలో జరుగుతుంది.ఈ నేపథ్యంలో షూటింగ్ గ్యాప్ లో రకుల్ ప్రీత్ చాట్ తింటూ.జంగిల్ లో షూటింగ్ చేస్తూ చాట్ తింటే ఆ మజానే వేరు‘అంటూ తన అనుభూతిని పంచుకుంది.
ఇక తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ టూ లో కూడా బిజీగా ఉంది.