కాలేజీ రోజుల్లోనే అలాంటి బట్టల్లో కనిపించిన రకుల్!

తెలుగు సినీ పరిశ్రమలో రకుల్ ప్రీత్ సింగ్ గురించి అందరికీ తెలిసిందే.గతంలో మోడల్ గా పోటీ చేసి మిస్ ఇండియా పిగెంట్ గా కూడా ఎంపికయ్యింది ఈ బ్యూటీ.

తన అందంతో, తన నవ్వుతో అందరినీ ఆకట్టుకుంది ఈ అందాల భామ.సాంప్రదాయంగా తెలుగు అమ్మాయిల కనిపించే పాతికేళ్లు దాటిన ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి పొట్టి పొట్టి బట్టలతో అందరిని ఆశ్చర్యపరిచింది.అయితే ఈ అందాల భామ 2009లో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తరువాత తెలుగు, తమిళ్, హిందీ భాషా చిత్రాలలో కూడా అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది రకుల్ ప్రీత్.తను చదువుకునే రోజుల్లో జాతీయ స్థాయిలో క్రీడాకారిణిగా కూడా గుర్తింపు పొందింది.

ఇది ఇలా ఉండగా తను చదువుకునే రోజుల్లో ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టె ముందు మోడలింగ్ కోసం అప్పట్లో బికినీ ఫోటో షూట్ చేసిందట.ఇందులో తను వేసుకున్న పొట్టి బట్టల గురించి ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతుంది.

ఆమె తీసుకున్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్.ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ఏంటి రకుల్ అప్పట్లోనే బికిని అః అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా బాలీవుడ్ లో రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వగా ఆ సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ తీసుకుందని వార్తలు రావడంతో రకుల్ ప్రీత్ కూడా ఎన్సీబీ విచారణకు హాజరైంది.ఇది ఇలా ఉండగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కమల్ హాసన్ సరసన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాలో నటిస్తుంది.

అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా ఒక సినిమాలో నటిస్తుంది.

తాజా వార్తలు