రాకేష్ మాస్టర్.( Rakesh Master ) చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడి, ఆ తర్వాత ఎంతో గొప్ప స్థాయికి ఎదిగి.
అంతే వేగంగా కిందికి పడిపోయారు.ఆయన కష్టపడి ఎదిగిన లేదా కిందికి పడిన అన్నింటికీ బాధ్యత కేవలం రాకేష్ మాస్టర్ ది మాత్రమే.
ప్రభాస్ నుంచి మహేష్ వరకు అందరు హీరోలకు పని చేశారు.కానీ కేవలం 5000, 10000 కోసం యూట్యూబ్ ఛానల్ చేసే మాయాజాలంలో పడిపోయి ఆయన తన జీవితాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లాడు.
ఆఖరికి కుటుంబం సైతం రాకేష్ మాస్టర్ ని ఇంట్లో నుంచి గెంటెయ్యడం జరిగింది అంటే ఆయన ఎంతటి అల్పమైన వాటికోసం ఆశపడ్డారు మనం అర్థం చేసుకోవచ్చు.ఇక ఆయన మరణించిన తర్వాత ప్రతి ఒక్కరు ఆయన చేసిన సేవలు, ఆయన మంచితనాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

కానీ ఈరోజు ఎవరైనా ఆయన గురించి బాధపడుతున్నారు అంటే అది కేవలం ఆయన భార్య మరియు ఇద్దరు పిల్లలు మాత్రమే.ఒక్కరోజు కూడా భార్య లక్ష్మి( Lakshmi ) గురించి ఆయన ఈ మీడియా ఇంటర్వ్యూలో చెడుగా చెప్పలేదు.అలాగే కూతురు రిషిక,( Daughter Rishika ) కొడుకు చరణ్( Charan ) గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పుకునేవారు.బోరబండలో నాలుగు అంతస్తుల ఇల్లు కట్టి తన భార్యకు ఇచ్చేశానని తను కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకు వచ్చానని పలు ఇంటర్వ్యూలలో చెప్పేవారు రాకేష్ మాస్టర్.
అయితే కేవలం మీడియా వల్లే ఆయన రోజురోజుకు దిగజారిపోయారని మీడియాలో అరాచకులు ఎక్కువగా ఉన్నారని ఆయన కొడుకు చరణ్ ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

తన తండ్రి ఇలా దిగజారి పోవడానికి మీడియా ( Media ) మాత్రమే కారణమని, ఆయన చనిపోయిన తర్వాత శవం పై పేలాలు ఏరుకుంటున్నారని, కానీ ఆయనకు సంబంధించిన విషయాలు కానీ కుటుంబ సభ్యుల జోలికి కానీ మీడియా వస్తే ఊరుకోనని, మా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మా కష్టాలు ఏంటి , చనిపోతే మేము ఎలా ఏడుస్తున్నాం అంటూ వంద సార్లు వేసి చూపిస్తూ మా జీవితాలను చీకటిమయం చేయొద్దని, ఒకవేళ మా మాట కాదని మా జీవితాల్లోకి ప్రవేశించాలని ఎవరైనా చూస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని రాకేష్ కొడుకు ఆవేశంగా మాట్లాడుతూ ఉండడం విశేషం.