గుంటూరు జిల్లా, రేపల్లె: కోణిజేటి రోశయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా అనేక సేవలు అందించారని, వారి యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుండి అంతిమం వరకు కూడా అంచలంచలుగా తనదైన శైలిలో ఎవరినీ నొప్పించకుండా అందరి మెప్పు పొందిన వ్యక్తని, రాష్ట్రంలో వారు చేసినటువంటి పదవులు ఎవరూ చేయలేదని, పదవులకే వన్నె తెచ్చిన వ్యక్తి.
ముఖ్యమంత్రిగా వారు ఉన్నప్పుడు వారి క్యాబినెట్ లో పనిచేసే అదృష్టం నాకు దక్కిందని, గత జ్ఞాపకాలను మననం చేసుకోంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని, ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.