మరీ అంత రేటైతే ఎలా.. జక్కన్న తీరుపై తీవ్ర విమర్శలు

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించిన టికెట్ల రేట్లు విషయం ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో భారీ మొత్తంలో టికెట్ల రేట్లను పెంచుతూ అధికారికంగా జీవోను జారీ చేయడం జరిగింది.

 Rajamouli Rrr Movie Tickets Rates Going To Sky , Ap Tickets Rates, Flim News, N-TeluguStop.com

పెద్ద సినిమాలకు అదనపు షో వేయడంతో పాటు ఎక్కువ టిక్కెట్ల రేట్లను పెంచుకోటానికి అవకాశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంతో ఇప్పుడు అదే విషయం ఆంధ్రప్రదేశ్లో ఆర్‌ఆర్ఆర్‌ యూనిట్ సభ్యులకు లాభం చేకూరుస్తుంది అంటూ సమాచారం ఉంటుంది.విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిన కనుక ప్రతి టికెట్ పై వంద రూపాయలు అదనంగా మొదటి రెండు వారాల పాటు పెంచుకునే విధంగా టికెట్ల రేట్లను తమ పరిధిలోకి ఇవ్వాలి అంటూ నిర్మాత దానయ్య మరియు దర్శకుడు రాజమౌళి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది అందుకు ఆయన అనధికారికంగా ఓకే చెప్పారు.

దాంతో ఏపీ ప్రభుత్వం టికెట్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Rajamouli, Ram Charan-Movie

మరో వైపు తెలంగాణలో కూడా భారీ మొత్తంలో టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అంటూ వార్తలు వస్తున్నాయి.అదే కనుక జరిగితే ట్రిపుల్‌ ఆర్ సినిమా చూడాలి అంటే జేబుకు చిల్లు పెట్టుకోవాల్సిందే అంటూ ప్రేక్షకులు మరియు నందమూరి మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఒక స్థాయి వరకు పర్వాలేదు కానీ మరి ఏంది ఈ రేట్లు అంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అభిమానులు సినీ ప్రేమికులు ఈ సినిమా విషయంలో అసంతృప్తిగా ఉన్నారు.

సినిమా రెండు వారాల పాటు భారీ స్థాయిలో వసూలు చేయాలి అంటే ఈ టికెట్ల రేట్లు పెంపు తప్పదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు వ్యాఖ్యలు చేస్తున్నారు.మరి జక్కన్నకు ప్రేక్షకుల నుండి వ్యతిరేకత వస్తుందా లేదంటే ఆయన కోరుకున్న మొత్తం పెట్టి మరీ సినిమా చూస్తారా అనేది మరి కొన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది.

మార్చి 25 తారీఖున ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube