ఫ్యాన్స్ ను కన్యూజ్ చేస్తున్న ప్రభాస్.. సలార్ రిలీజ్ పై డౌట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.అందులో ‘సలార్’ సినిమా ఒకటి.

 Doubts On Prabhas Salaar, Doubts On Prabhas Salaar,  prabhas, Salaar Movie, Shr-TeluguStop.com

కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రెసెంట్ ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు.

ఈ సినిమా సంక్రాంతి 2022 లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు.కానీ ఈ సంక్రాంతి పోయింది.

ఇక ఇప్పుడు 2023 లో అయినా రిలీజ్ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

కానీ ఈ ఏడాది అయితే రిలీజ్ చేయాలనీ మేకర్స్ అనుకోవడం లేదట.

ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న కూడా రిలీజ్ పై చర్చలు కొనసాగుతున్నాయి.

అయితే ఈ సినిమా రెండు పార్టులుగా మార్చే విషయంపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయని.అందుకే షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉండడంతో ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదాలు వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే రాధేశ్యామ్ ప్రొమోషన్స్ లో భాగంగా ఈ విషయంపై ప్రభాస్ ను అడిగితే మాట్లాడడానికి నిరాకరించారు.

Telugu Doubtsprabhas, Prabhas, Prashanth Neel, Salaar, Shruti Haasan-Movie

ఈయన మాట్లాడక పోవడంతో ఇప్పుడు ఈ సినిమా గురించి ఇష్టం వచ్చినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ ను ఎలా రెండు పార్టులుగా తెరకెక్కించాడో ఈ సినిమా కూడా అలాగే తీసుకు వస్తాడా.లేదంటే ఇంకేదన్న కారణం ఉందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

ఇక ఇటీవలే రాధేశ్యామ్ రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube