ఒకప్పుడు తిండి లేక ఏడ్చాడు.. ఇప్పుడు రూ.కోట్ల సంపాదన.. రాజానాయక్ సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

దేశంలో తినడానికి తిండి లేక బాధ పడుతున్న, ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలను అమలు చేస్తున్నా కొంతమంది జీవితాలు మాత్రం మారడం లేదు.

 Raja Nayak Inspirational Success Story Details Here Goes Viral In Social Media-TeluguStop.com

రాజా నాయక్ అనే వ్యక్తి పేద కుటుంబంలో జన్మించాడు.తినడానికి తిండి కూడా లేకపోవడం వల్ల రాజా నాయక్( Raja Naik ) పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.సరైన చదువు కూడా చదువుకోకపోవడం అతడిని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది.

17 సంవత్సరాల వయస్సులోనే రాజా నాయక్ ఇంటినుంచి పారిపోయారు.ముంబైకు( Mumbai ) వెళ్లిన రాజా నాయక్ కు అక్కడ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.అయితే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న రాజా నాయక్ కష్టపడి కోట్ల రూపాయలు సంపాదించారు.

బెంగళూరుకు( Bangalore ) చెందిన రాజా నాయక్ నిరుపేద కుటుంబంలో జన్మించడం చదవాలనే అతని కల నెరవేరలేదు .

Telugu Bangalore, Raja Nayak-Movie

తండ్రికి సంపాదన లేకపోవడంతో పాటు తల్లి బ్రతకడానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.17 ఏళ్ల వయస్సులోనే ఇంటినుంచి పారిపోయిన రాజా నాయక్ కు సరైన చదువు లేకపోవడం వల్ల జాబ్ రాలేదు.దృఢమైన విశ్వాసంతో ఏదో ఒకటి సాధించాలనుకున్న రాజా నాయక్ ఫుట్ పాత్ పై షర్ట్ లను విక్రయించడం మొదలుపెట్టాడు.

జీవితం మీద కసితో పగలు, రాత్రి కష్టపడి పని చేశాడు.

Telugu Bangalore, Raja Nayak-Movie

పుట్ పాత్ నుంచి చిన్న దుకాణం నడిపే స్థాయికి ఎదిగాడు.తను సంపాదించిన డబ్బుతో కొల్హాపురి చప్పల్స్ అండ్ ఫుట్ వేర్ బిజినెస్( Kolhapuri Chappals and Foot Wear Business ) ను మొదలుపెట్టాడు.తర్వాత రోజుల్లో రాజా నాయక్ రియల్ ఎస్టేట్ బిజినెస్ పై దృష్టి పెట్టారు.

రాజా నాయక్ సంస్థ ఆదాయం 60 కోట్ల రూపాయలుగా ఉంది.ఇతని సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.

రాజా నాయక్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube