యువరాజు పాదయాత్ర

యాభైఏడు రోజులపాటు విదేశాలకు వెళ్లి రాగానే కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలో చాలా మార్పులు కలుగుతున్నాయి.ఆయన ఆలోచనల్లో మార్పు వస్తోంది.

 Rahul Opts For Tough Trek To Kedarnath Shrine-TeluguStop.com

ఇప్పుడాయన పాదయాత్ర తలపెట్టారు.పాదయాత్ర అంటే ఇదేదో ప్రజా సమస్యలపై చేస్తున్న పాదయాత్ర కాదు.

ఉద్యమమూ కాదు.ఇది ఆయన వ్యక్తిగత విషయం.

విదేశాల నుంచి రాగానే పార్లమెంటులో రెండు రోజులు అనర్గళంగా న్రసంగించి ప్రధాని మోదీపై విరుచుకుపడిన రాహుల్‌ రెండు రోజులు తన కోసం కేటాయించుకున్నారు.ఆయన శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌కు బయలుదేరారు.

తిరుమల మాదిరిగా కేదార్‌నాథ్‌ ఆలయం ఎక్కడో కొండ పైన ఉంటుంది.రెండేళ్ల క్రితం ఇక్కడ ఆకస్మికంగా భారీ వరదలు రావడంతో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లినవారిలో చాలామంది మృత్యవాత పడిన గుర్తుండేవుంటుంది.

అదే ఆలయానికి రాహుల్‌ బయలుదేరారు.దైవ దర్శనం కోసమే ఆయన ఈ యాత్ర తలపెట్టారు.

పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు కాబట్టి అంతా సజావుగా జరగాలని కోరుకుంటున్నారు కావొచ్చు.అయితే ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ రాహుల్‌కు హెలిక్యాప్టర్‌ ఏర్పాటు చేస్తానన్నారు.

ఎందుకంటే ఈ నడక దూరం పదిహేడు కిలోమీటర్లు.యువరాజు అంతదూరం నడవలేరని ఈ సౌకర్యం కల్పిస్తానన్నారు.

కాని రాహుల్‌ తిరస్కరించారు.తాను నడిచేవెళతానన్నారు.

ఏమిటీ మార్పు?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube