నేడు ఓటీటీలో పుష్ప రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు కొద్ది గంటల ముందే సినిమా నుండి సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన సామీ సామీ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు పుష్ప మేకర్స్.పుష్ప రాజ్ క్యారక్టర్ ని వర్ణిస్తూ అతనిపై ప్రేమని చూపిస్తూ శ్రీవల్లి పాడే ఈ పాటకి మాస్ టచ్ ఇచ్చి దేవి అదరగొట్టాడు.సినిమాలో ఈ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.పుష్ప ఫ్యాన్స్ అందరు మెచ్చే ఈ సామీ సాంగ్ ఫుల్ వీడియో సాంగ్ కోసం ఎంతగానో ఎదురుచూశారు.
లేటెస్ట్ గా ఫ్యాన్స్ కోసం సామీ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
పుష్ప సామీ ఫుల్ సాంగ్ అలా రిలీజైందో లేదో ఇలా వైరల్ గా మారింది.
బన్నీ, రష్మిక పర్ఫార్మెన్స్ ఈ సాంగ్ లో స్పెషల్ హైలెట్ గా నిలిచింది.విజే శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ ని కొరియోగ్రఫీ చేశారు.ఈ సాంగ్ లోని సామీ సామీ స్టెప్పుని పుష్ప ప్రమోషన్స్ లో రష్మిక చాలా సార్లు పర్ఫార్మ్ చేసింది.పుష్ప సినిమా రిజల్ట్ విషయానికి వస్తే బాలీవుడ్ లో అల్లు అర్జున్ కి కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టింది పుష్ప పార్ట్ 1.పుష్ప పార్ట్ 1 సెన్సేషనల్ హిట్ అవడంతో పార్ట్ 2పై మరింత అంచనాలు పెరిగాయి.పుష్ప పార్ట్ 2 రికార్డుల విషయంలో తగ్గేదేలే అనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.