శ్రీకాకుళం జిల్లా పలాసలో సైకో వీరంగం సృష్టించాడు.పలాసలో ఓ వృద్ధుని తలపై కర్రతో దాడికి పాల్పడ్డాడు.
ఈ క్రమంలో సైకోను అడ్డుకోబోయిన వాహనదారులపైనా దాడులు చేస్తూ వీరంగం వేశాడు.అటుగా వెళ్తున్న విద్యార్థులపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఎట్టకేలకు సైకోను పట్టుకున్న స్థానికులు స్తంభానికి కట్టేసి చితకబాదారు.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కాశీబుగ్గ పోలీసులు.
సైకోను అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు సైకో దాడిలో గాయపడిన వృద్ధుడిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.