టాలీవుడ్ నటుడు బండ్ల నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తరచూ ఏదో ఒక వివాదంతో వార్తలు నిలుస్తూ ఉంటాడు బండ్ల గణేష్.
ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలు గుప్పిస్తూ ఎక్కువగా వార్తలో నిలుస్తూ ఉంటాడు.బండ్ల గణేష్ సినిమాల ద్వారా కంటే కాంట్రవర్సీల ద్వారా బాగా పాపులారిటి సంపాదించుకున్నాడు అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.బండ్లన్న అల్లు అర్జున్ పై చేసిన వాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఒక ప్రైవేట్ ఫంక్షన్‌లో పాల్గొన్న బండ్ల గణేశ్ అల్లు బాబీతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు.
ఈ సందర్భంగా బండ్ల మాట్లాడుతూ.
అందరికీ చెప్తున్నా, తండ్రి మాట వినొద్దు.తండ్రిని గౌరవించి ఆయన మాట వింటే మా బాబీగారిలా అవుతారు.
తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తే బన్నీగారిలా అవుతారు.బాబీగారిలా అవ్వాలా? బన్నీగారిలా అవ్వాలా? అనేది మీరే నిర్ణయించుకోండి అని కామెంట్స్ చేసాడు బండ్ల గణేష్.అనంతరం ఆ కామెంట్స్ గురించి వివరణ ఇస్తు బాబీ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుని మామూలుగా ఇలా ఉన్నాడు.చిన్నప్పటి నుంచి తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు చేసుకుంటూ పోయిన బన్నీ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు.
దయచేసి తండ్రి మాట వినొద్దు, సొంత నిర్ణయాలు తీసుకోండి.తండ్రి మాట విన్న బాబీని చూడండి, వినని బన్నీని చూడండి అంటూ అల్లు అర్జున్ ముందర బాబీ ని తక్కువ చేసి మాట్లాడినట్లు గా కామెంట్స్ చేశాడు బండ్ల గణేష్.
ఈ మాటలను బాబీ పాజిటివ్‌గా తీసుకుని సరదాగా నవ్వాడు.అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంపై కొందరు అల్లు అభిమానులు బండ్ల గణేష్ పై మండిపడుతున్నారు.పబ్లిక్‌లో ఏది పడితే అది వాగేయడమేనా? కాస్తైనా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా, దీన్నే నోటిదురుసు అంటారు.ఒకరిని కించపరిచేలా మాట్లాడటం నీకు సరదాగా ఉందా? ఏది పడితే అది వాగడం తగ్గించుకుంటే మంచిది అని కామెంట్లు చేస్తూ బండ్లన్న పై మండిపడుతున్నారు.ఇంకొందరు నెటిజెన్స్ తండ్రి మాట వినలేదని బన్నీ నీకొచ్చి చెప్పాడా? నోటికొచ్చినట్లు వాగుతున్నావ్ అంటూ బండ్లన్న ను ఏకిపారుస్తున్నారు.