టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ప్రస్తుతం వరుస హిట్ లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
కానీ ఇందులో తన పాత్రతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.ఇక ఆ తర్వాత పలు సినిమాలలో కూడా ఎక్కువ అవకాశాలు అందుకోలేకపోయింది.
దీంతో అవకాశాల కోసం తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది ప్రియాంక.సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో బాగా హల్ చల్ చేస్తుంది.
ఇదిలా ఉంటే తనకు అల్లు అర్జున్ అంటే క్రష్ అని తెలిపింది.
మొదట షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు అందుకొని టాలీవుడ్ లో అడుగు పెట్టింది.2017 లో కలవరమాయే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టాక్సీవాలలో నటించింది.ఇదిలా ఉంటే ఇటీవలే తిమ్మరుసు సినిమాలో నటించగా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.
ఇక తాజాగా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకోగా కొన్ని విషయాలు అభిమానులతో పంచుకుంది.
తను మాట్లాడుతూ.
తన మేకప్ వల్లే తను అందంగా ఉన్నానని తెలిపింది.
తన అందం విషయంలో ట్రోల్స్ కూడా ఎదుర్కుందట ప్రియాంక.అలా అందం విషయంలో మరింత నాజూగ్గా, గ్లామర్ గా కల్పించాలని అనుకున్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నానని తెలిపింది.తనకు థైరాయిడ్ ఉందని.
అందుకు తనకు ఫేస్ పై పింపుల్స్, శరీర బరువులో మార్పులు వచ్చాయని తెలిపింది.తర్వాత ఆరోగ్యం పట్ల, శరీర పట్ల జాగ్రత్త తీసుకొని సన్నబడిందట.
ఇక తన వంటలు తానే ప్రిపేర్ చేసుకునేదట.వెయిట్ లాస్ తనకు పెద్ద చాలెంజ్ అని.చాలా కష్టపడ్డానని తెలిపింది.ఇక తనను నటిగా నిరూపించుకోవాడానికి మంచి గుర్తుండే పాత్రలలో చేయాలని ఫిక్స్ అయిందట.
ఇక తను దిగిన గ్లామర్ ఫోటోలు వైరల్ కావడంతో హ్యాపీగా ఉందని తెలిపింది.అంతేకాకుండా అందాల ఆరబోతకు సిద్ధమేనని.ప్రస్తుతం తనకు ఆఫర్లు వస్తున్నాయని తెలిపింది.తమిళంలో కూడా ఒక సినిమాకు అవకాశం వచ్చిందని.
బాలీవుడ్, వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు వస్తున్నాయని తెలిపింది.అల్లు అర్జున్ అంటే తనకు క్రష్ అని. అతనితో అవకాశం వస్తే నటించడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.