మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును ఆయన అభిమానులు ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారో అందరికీ తెలిసిందే.తమ అభిమాన హీరో చిరంజీవి పుట్టిన రోజున ఫ్యాన్స్ కేవలం సంబరాలు మాత్రమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు.
ముఖ్యంగా రక్తదాన శిబిరాలు, అన్నదానం లాంటివి చేసి చిరుపై తమ ప్రేమను చాటుతుంటారు.అయితే ఈసారి మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డేకు తాను కూడా ఓ గిఫ్ట్ ఇస్తానంటున్నాడు ఓ బజార్ రౌడీ.
ఇంతకీ ఈ బజార్ రౌడీ ఎవరు? అతడి కథ ఏమిటో తెలుసుకుందామా.
టాలీవుడ్‌లో హృదయ కాలేయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణే్ష్ బాబు, ఆ తరువాత వరుసగా పలు సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
ఇక ఆయన నటించిన కొబ్బరిమట్ట చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నవ్వులు పూయించాయో అందికీ తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ బర్నింగ్ స్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘బజార్ రౌడీ’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడగా, ఇప్పుడు థియేటర్లు మళ్లీ తెరుచుకోవడంతో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
అయితే సినిమా ప్రచారంలో సంపూ ఎప్పుడూ తన వైవిధ్యతను చూపిస్తుంటాడు.
ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22కు రెండు రోజులు ముందుగా ‘బజార్ రౌడి’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు సంపూ ప్రకటించాడు.
బజార్ రౌడి చిత్రాన్ని చూసి మెగాస్టార్ బర్త్‌డేను మరింత ఘనంగా సెలెబ్రేట్ చేయాలని ఆయన ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను కోరారు.సంపూ మార్క్ పూర్తి ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
ఇక ఈ సినిమాను డి.వసంత నాగేశ్వరరావు డైరెక్ట్ చేయగా, సంపూ సరసన మహేశ్వరి వద్ది హీరోయిన్‌గా నటించింది.
మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో తెలియాలంటే ఆగస్టు 20 వరకు వెయిట్ చేయాల్సిందే.







