ప్రియదర్శిని రామ్( Priyadarshini ram ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, ప్రముఖ పత్రికలలో పని చేయడం ద్వారా ప్రియదర్శిని రామ్ మంచి పేరును సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న న్యూసెన్స్ వెబ్ సిరీస్ కు కథ అందించింది ప్రియదర్శిని రామ్ కావడం గమనార్హం.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి( Y.S.Rajasekhara Redd )కి అత్యంత సన్నిహితులలో ఒకరైన రామ్ వైఎస్ చనిపోయిన సమయంలో ఎదురైన పరిస్థితుల గురించి సైతం షాకింగ్ విషయాలను వెల్లడించడం గమనార్హం.మీసాల రామ్ గా పేరు తెచ్చుకున్న రామ్ మాట్లాడుతూ కొంచెం రాసి క్రియేటివ్ గా ఏదైనా చేస్తే డబ్బులు వస్తాయని నమ్మకంతో 20 సంవత్సరాల వయస్సులో యాడ్ ఏజెన్సీని మొదలుపెట్టానని ఆయన కామెంట్లు చేశారు.

రాయడం అనే కళ అవసరం ద్వారా వచ్చిందని ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీకి, రాజీవ్ గాంధీకి ( Rajiv Gandhi )కూడా యాడ్స్ వేయడం అంటే అదృష్టం అని రామ్ చెప్పుకొచ్చారు.నాకు, అన్నయ్య గారికి ఇందిరా గాంధీ గారు ఇంటికి పిలిచిన సమయంలో అన్నం కూడా వడ్డించేవారని రామ్ పేర్కొన్నారు.రాజీవ్ గాంధీ గారికి మా అన్నయ్య అంటే చాలా ఇష్టమని ప్రియదర్శిని రామ్ చెప్పుకొచ్చారు.

తారాదేవికి, అన్నయ్యకు పెళ్లిచూపులు అరేంజ్ చేసింది రాజీవ్ గాంధీ అని రామ్ తెలిపారు.వైఎస్సార్ మా ఇంటికి వచ్చేవారని మా అమ్మ వేసే దోసెలు అంటే వైఎస్సార్ కు చాలా ఇష్టమని ఆయన అన్నారు.వైఎస్సార్ నాకు బ్రదర్ అని ఆయన నాకు అంత దగ్గరని రామ్ తెలిపారు.వైఎస్సార్ చనిపోయిన సమయంలో జగనన్న లేచి వచ్చి నా రెండు చేతులు పట్టుకుని కాళ్లకు చెప్పులు లేకపోయినా పరవాలేదు.
నాన్న అనుకున్నదల్లా చేయాలని జగన్ చెప్పారని ఆయన తెలిపారు.రాజశేఖర్ రెడ్డిని చాలా ఎక్కువగా ప్రేమించిన వాళ్లలో విజయమ్మ ఒకరని రామ్ వెల్లడించారు.విజయమ్మ నాతో ఇంతమంది మీ అన్న చనిపోయాడని ప్రాణాలు పోగొట్టుకున్నారని వాళ్లందరూ ప్రేమించే కదా మరి నేనెందుకు ఇంకా బ్రతికున్నానని అన్నారని రామ్ కామెంట్లు చేశారు.నా ప్రేమ అంత గొప్పది కాదా అని కామెంట్ చేశారని రామ్ అన్నారు.
మంచి ఫ్యామిలీ అని గుండె కోస్తే ప్రేమ కారుతుందని ఆయన తెలిపారు.