తెలంగాణా రాష్ట్రం లోని గాంధీ ఆసుపత్రిలో టెన్షన్ నెలకొంది.చర్లపల్లి జైలు నుంచి వచ్చిన నలుగురు ఖైదీలు ఆసుపత్రి నుంచి పారిపోవడం కలకలం రేగింది.
అయితే ఇంతకీ ఆ నలుగురు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ ఆయిన వారే కావడం గమనార్హం.గురువారం ఉదయం 3 గంటల సమయంలో సిబ్బంది కళ్లుగప్పి పారిపోగా,ఎవరూ గుర్తించలేదు.
తెల్లవారిన తర్వాత వార్డులోకి వచ్చిన సిబ్బంది ఆలస్యంగావిషయం తెలుసుకోవడం తో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీనితో సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఖైదీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే ఆ నలుగురికి కూడా కరోనా పాజిటివ్ ఉండడం తో అధికారులు మరింత ఆందోళన చెందుతున్నారు.అసలుకే గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడం తో ఇలా కరోనా పేషేంట్లు పారిపోవడం కలవరం కలిగిస్తుంది.
చర్లపల్లి జైలులో ఉంటున్న కొంత మంది ఖైదీలకు ఇటీవల కరోనా సోకింది.నలుగురిని పోలీసులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
వారికి కాపలాగా ఎస్కార్ట్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు.అయితే ఈ సమయంలో రెండో అంతస్తులోని బాత్రూమ్స్ వద్దకు వెళ్లి గ్రిల్స్ తొలగించి తప్పించుకున్నట్లు తెలుస్తుంది.
ఓ వైపు కరోనా పేషేంట్లు కావడం, మరోవైపు నేరగాళ్లు కూడా కావడంతో అందరిలో టెన్షన్ నెలకొంది.