నిన్న దీపావళి పండుగ సందర్భంగా సరిహద్దులలో ఉన్న జవాన్ లతో వేడుకలు చేసుకున్న మోడీ ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ నీ దర్శించుకోవడానికి రెడీ అయ్యారు.ఈరోజు ఉదయం కేదార్ నాద్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
కొత్తగా నిర్మించిన ఆదిశంకర సమాధి.విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.ఆదిశంకర విగ్రహానికి కొబ్బరినీళ్ళతో అభిషేకం చేయనున్నారు.అదే రీతిలో ఆలయ ప్రాంగణంలో 250 కోట్ల రూపాయలతో.చేసిన అభివృద్ధి పనులను ఆవిష్కరించనున్నారు.

కేదార్ నాథ్ ఆలయం లో ఇప్పటికే పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తయ్యాయి.2013వ సంవత్సరంలో భారీ వరదలకు.ఆదిశంకర చార్య సమాధితో పాటు కేదార్ నాథ్ లో పలు కట్టడాలు ధ్వంసం కావడంతో.
వాటిని పునర్నిర్మించారు.ఈ తరుణంలో భారీ ఎత్తున ఏర్పాటుచేసిన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని.
కూడా ఈరోజు ఆవిష్కరించనున్నారు. ఇదిలా ఉంటే దీపావళి పండుగ సందర్భంగా కేదార్ నాథ్ ఆలయాన్ని.
దీపాలతో పాటు పూలతో సుందరంగా అలంకరించారు.ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో నిండింది.
ప్రధాని మోడీ రాకతో ఆలయప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లూ చేయడం జరిగింది.