74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లుని తెలిపారు.
విశ్వశాంతికి భారత్ కట్టుబడి ఉందని…జీ 20 సదస్సు దేశ ప్రతిష్టను పెంచుతుంది అన్నారు.భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని తెలిపారు.
దేశ ప్రగతికి పాటుపడుతున్న ప్రతి భారతీయుడికి అభినందనలు తెలిపారు.
ఇదే సమయంలో దేశ సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడుతున్న జవాన్ లను కొనియాడటం జరిగింది.
ఒకప్పుడు నిరాక్షరాస్యత, పేదరికం తాండవించే స్థాయి నుంచి ప్రపంచ స్థాయిలోని అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ ఆవిర్భవించిందని చెప్పుకొచ్చారు.భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అని తెలిపారు.
పట్టణ గ్రామీణ ప్రాంతాలను కలిపే వేదిక డిజిటల్ ఇండియా అని స్పష్టం చేశారు.
రాజ్యాంగాన్ని అనుసరించటం మన కర్తవ్యమని… రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ కీ దేశం రుణపడి ఉంటుందని రాష్ట్రపతి తెలియజేయడం జరిగింది.దేశానికి అన్నివేళలా రాజ్యాంగమే మార్గదర్శకం.వివిధ భాషలు మరియు సంస్కృతాలు మనల్ని కలుపుతూ ఉందని ద్రౌపది ముర్ము జాతినీ ఉద్దేశించి బుధవారం ప్రసంగించారు.