సినిమా ఇండస్ట్రీలో రోజు రోజుకి చాలా మంది కొత్త హీరోలు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు.కానీ వారిలో కొందరు మాత్రం మంచి హిట్ ని సాధిస్తారు హిట్స్ వచ్చినప్పటికీ ఆ హిట్స్ తాలూకు పరం వారిని కొనసాగించలేక చాలా మంది మధ్యలోనే చతికిలబడి పోతుంటారు.ఎంత తొందరగా సక్సెస్ అయ్యారో అంతే తొందరగా కిందపడి పోతూ ఉంటారు.1999లో వచ్చిన ప్రేమికుల రోజు సినిమా లో హీరో గా చేసిన కునాల్ సింగ్ పరిస్థితి కూడా అలాంటిదే.మోడలింగ్ లో ఉన్న కునాల్ సింగ్ ని డైరెక్టర్ కదిరి చూసి నేను అనుకున్న స్క్రిప్టుకి ఈ అబ్బాయి సరిగ్గా సరిపోతాడని అనుకుని ప్రొడ్యూసర్ తో చెప్పి కునాల్ సింగ్ తో మాట్లాడి ఆయన నీ హీరోగా పెట్టి సోనాలి బింద్రే నీ హీరోయిన్ గా పెట్టి ప్రేమికుల రోజు అనే ఒక లవ్ స్టోరీ తీశారు దీనికి ఏ ఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ చాలా హిట్ అయింది.
ఇప్పటికి చాలా మంది జనాలు ఆ సినిమాలో సాంగ్స్ వింటూనే ఉంటారు.
ప్రేమికుల రోజు సినిమా తో మంచి హిట్ అందుకున్న కునాల్ ఆ తర్వాత ఎంచుకున్న సినిమాలు సరిగ్గా ఆడలేదు దాంతో ఏం చేయాలో తెలియలేదు.కొన్ని సినిమాలు ఆడినప్పటికీ అతనికి సినిమా అవకాశాలు రాలేదు దీంతో ఏం చేయాలో తెలియక అసిస్టెంట్ ఎడిటర్ గా చేసాడు.
తర్వాత కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా చేశాడు.అప్పటికి అప్పుల్లో కూరుకుపోయిన కునాల్ కి భార్య అనురాధ సింగ్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయితే ప్రొడ్యూసర్ గా సినిమాలు చేస్తున్నాడు కానీ ఏ ఒక్క సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది దీంతో ఏం చేయాలో తెలియక రెండు మూడు సార్లు సూసైడ్ చేసుకోవడానికి తన మణికట్టు నరాలు కోసుకోవడానికి ప్రయత్నించాడు.అయితే అతనికి నటి లావీణ భాటియతో సంబంధం ఉందని చాలామంది అంటారు.
అయితే తీవ్రంగా పెరిగిపోయిన అప్పుల వల్ల ఏం చేయాలో తెలియక ఫిబ్రవరి 7, 2008 వ సంవత్సరం లో ముంబైలోని తన అపార్ట్మెంట్ లోనే ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయాడు.
సినిమాల్లోకి వచ్చేటప్పుడు సాధారణ జనాలు అక్కడ లైఫ్ హ్యాపీగా ఉంటుందని అపోహలు పెట్టుకొని ఇండస్ట్రీకి వస్తుంటాడు కానీ మనం ఆశించినట్టుగా ఇక్కడ అందరి జీవితాలు హాయిగా ఉండవు.దీనికి కునాల్ సింగ్ లాంటి హీరోల జీవితాలే ఉదాహరణ.ఇలా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది హీరోలు అవకాశాలు లేక వచ్చిన అవకాశాలతో ఉపయోగం లేక వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఊహించుకొని రెండు మూడు సినిమాలతో స్టార్ హీరోలు అయిపోయిన తర్వాత అంతటి హిట్స్ రాకపోవడంతో చాలా మంది యంగ్ హీరోలు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు.
నిన్నటికి నిన్న బాలీవుడ్ నటుడు అయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు.ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యంగ్ హీరోలు ఓ రెండు హిట్స్ కొట్టిన తర్వాత వాళ్లు ఊహించలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడంతో వాళ్లు ఒక స్టార్ అనే స్థాయిలో ఉండి పోతున్నారు.
తర్వాత హిట్స్ లేక డీలా పడిపోయి ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గిపోవడంతో తాము అనుకున్న కెరియర్ ఇక్కడ లేదని బాధపడి సూసైడ్ చేసుకుంటున్నారు కానీ అలా చేయడం చాలా తప్పు.ప్రేమ దేశం తో మంచి గుర్తింపు పొందిన హీరో అబ్బాస్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడంతో తను ఏమాత్రం బాధ పడకుండా న్యూజిలాండ్ వెళ్లి అక్కడ సెటిలై, మనం ఉన్న ఒక ఫీల్డ్ లో మనం ఫెయిల్ అయిపోతే మనకి ఇంకో ఫీల్డ్ లో అవకాశం ఉంటుందని భావించాలి.అంతే తప్ప సూసైడ్ లాంటివి చేసుకోవద్దని అందరికీ మంచి మెసేజ్ ఇచ్చాడు.