మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, బిగ్ బాస్ హోస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు మోహన్ లాల్.ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా మోహన్ లాల్ చేరువయ్యారు.
మోహన్ లాల్ మలయాళంలో నటించిన పలు సినిమాలు తెలుగులోకి అనువాదం కావడంతో పాటు తెలుగులో మంచి ఫలితాన్ని అందుకున్నాయి.
అయితే మోహన్ లాల్ కూతురు విస్మయ తండ్రి గర్వపడేలా చేశారు.
కొన్నిరోజుల క్రితం బరువు తగ్గి వార్తల్లో నిలిచిన విస్మయ రచించిన తొలి నవల నేడు విడుదల కానుంది.గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్ పేరుతో విస్మయ రాసిన ఈ నవలను ప్రముఖ సంస్థలలో ఒకటైన పెంగ్విన్ ఇండియా సంస్థ విడుదల చేస్తోంది.
నవల రాయడం గురించి విస్మయ మాట్లాడుతూ తనకు ఇష్టమైన బీట్ ను వింటూ కవిత్వంతో ఈ నవలను రాశానని ఆమె చెప్పుకొచ్చారు.

నా కుమార్తె పుస్తకం ఫిబ్రవరి 14 నుంచి దేశంలోని అన్ని ప్రముఖ బుక్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటుందని.ఆ పుస్తకాన్ని చదివి అభిప్రాయాలను పంచుకోవాలని మోహన్ లాల్ పేర్కొన్నారు.మరోవైపు విస్మయ గతంలో ఊబకాయంతో బాధ పడగా థాయ్ లాండ్ కు వెళ్లి బరువు తగ్గి అట్రాక్టివ్ లుక్ లోకి మారారు.
ఏకంగా 22 కిలోల బరువు తగ్గి మోహన్ లాల్ అభిమానులను సైతం ఆమె ఆశ్చర్యపోయేలా చేశారు.
తండ్రి మలయాళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అయితే కూతురు మాత్రం రచయితగా కెరీర్ ను ఎంచుకోవడం గమనార్హం.
మరోవైపు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం 2 ఈ నెల 19వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది.దృశ్యం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.