కువైట్ లో భారతీయులపై ప్రశంసలు...రక్త దానం చేసే వారిలో అత్యధికులు మనోళ్ళేనట..!!

భారతీయలు ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలకు వెళ్ళినా సరే వారికంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకుంటారు.మనదైన సేవ గుణం, నలుగురికి సాయం చేయాలనే తపన మనల్ని కాళీగా ఉండనివ్వవు అందుకే విదేశాలలో నైనా సరే సేవా సంస్థలు ఏర్పాటు చేసుకుని తమకు తోచిన సాయం తోటివారికి, సహచర భారతీయులకు అందిస్తున్నారు.

 Praise For The Indians In Kuwait Most Of The Blood Donors Are Heartbroken, Indi-TeluguStop.com

తాజాగా అక్కడి భారత ఎంబసీ రాయబారి సిబి జార్జ్ కువైట్ లో భారతీయులు చేస్తున్న సేవలను గుర్తు చేస్తూ ప్రశంసలు కురిపించారు.

ప్రపంచ రక్త దాతల దినోత్సవం పురస్కరించుకుని కువైట్ లో ఉన్నఇండియన్ ఎంబసీ కార్యాలయంలో ఇండియన్ డాక్టర్స్ ఫోరం తో కలిసి ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరంలో రాయబారి సిబి జార్జ్ పాల్గొన్నారు.

కువైట్లో ఎంతో మంది భారతీయులు ఉన్నారని ప్రాంతాల వారిగా వారు పలు సంస్థలు ఏర్పాటు చేసుకున్నా అందరూ ఒకే తాటిపై నడవడం సంతోషంగా ఉందని, కువైట్ వ్యాప్తంగా రక్త దానం చేసే వారిలో భారతీయులే ముందు వరుసలో ఉన్నారని పొగడ్తలలతో ముంచెత్తారు.అంతేకాదు రక్త దానం చేస్తున్న భారతీయులను హీరోలు అభివర్ణించారు.

కువైట్ లో ఎలాంటి సేవా కార్యక్రమం ఏర్పాటు చేసినా భారతీయ యువకులు ముందుకు వస్తున్నారని, రక్త దానంలో కూడా వారు ఎంతో చురుకుగా పాల్గొంటున్నారని వారు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.భారతీయులు చేస్తున్న సేవలకు కువైట్ రాజులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని, అధికారులు కూడా ప్రశంసిస్తున్నారని తెలిపారు.

రక్త దానం చేసేలా ప్రోశ్చహిస్తున్న ఇండియన్ కమ్యునిటీలను ఆయన అభినందించారు.కాగా కరోనా సమయంలో కూడా ఇండియన్ కమ్యునిటీలు వారికి తోచిన సాయం అందిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube