ప్రభాస్, ప్రశాంత్ నీల్( Prabhas Prashanth Neel ) కాంబో లో రూపొందిన సలార్ సినిమా విడుదలకు సిద్దం అయింది.రెండు రోజుల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా లో ఐటం సాంగ్ ఉందా లేదా అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా సినిమా విడుదలకు ముందే ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పాటలను విడుదల చేసే వారు.కానీ ఈ సినిమా పాటల్లో కేవలం ఒక్కటి మాత్రమే విడుదల చేయడం జరిగింది.
ఐటం సాంగ్ ను చిత్రీకరించారు.కానీ అది సినిమా లో ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సినిమా మేకింగ్ సమయంలో మరియు ప్రమోషన్ సమయంలో ఐటం సాంగ్స్ కి సంబంధించిన హడావుడి కనిపించడం లేదు.అసలు సలార్ లో( Salaar movie ) ఐటం సాంగ్ ను ఎవరు చేశారు అనే విషయం లో కూడా స్పష్టత ఇవ్వలేదు.మొత్తానికి ఐటం సాంగ్ ని పెద్దగా ప్రమోట్ చేయలేదు.కనుక సినిమా లో ఆ పాట ఉండే అవకాశాలు తక్కువ అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం పాట ఉండి మరి కొన్ని ఏరియాల్లో తొలగించే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారా అనే చర్చ కూడా జరుగుతోంది.
హిందీ వర్షన్ లో ఐటం సాంగ్ విషయం లో చర్చలు జరిగాయి.అక్కడ ఉండేది లేనిది కన్ఫర్మ్ లేదు.అయితే మొత్తం అన్ని భాష లకు కూడా ఐటం సాంగ్ ను ఉంచి సెన్సార్ చేయించారు.
కానీ సలార్ విడుదల అన్ని చోట్ల ఐటం సాంగ్ ( Item Song )ఉంటుందా అనేది తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఓవర్సీస్ లో పది కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసిన సలార్ ముందు ముందు ఓవర్సీస్ లో వంద కోట్ల వసూళ్లు నమోదు చేయడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.