సలార్‌ 1 లో శృతి హాసన్ కనిపించేది ఎంత సమయమో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా రూపొందుతున్న సలార్‌ సినిమా లో హీరోయిన్‌ గా యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్ నట వారసురాలు శృతి హాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే.ఇప్పటికే ఈ సినిమా లో ఆధ్య పాత్ర లో శృతి కనిపించబోతున్నట్లుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రకటించాడు, అందుకు సంబంధించి ఒక పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది.

 Prabhas Salaar Movie Heroine Sruthi Hassan Run Time,prabhas,shruti Haasa,salaar-TeluguStop.com

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సలార్‌ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అవుతున్నాయి.

Telugu Prabhas, Prashant Neel, Salaar, Shruti Haasa-Movie

ముందుగా అనుకున్న ప్రకారం సలార్( Salaar Movie ) ను ఇదే నెలలో విడుదల చేయాలని భావించారు.కానీ పరిస్థితులు అనుకూలించక పోవడం తో సలార్ సినిమా ను వాయిదా వేయడం జరిగింది.డిసెంబర్ లో అయినా సలార్‌ ను విడుదల చేస్తారని తెలుస్తోంది.

సలార్‌ 1 విడుదలకు సంబంధించిన క్లారిటీ మరి కొన్ని వారాల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఆ విషయాన్ని పక్కన పెడితే సలార్‌ 1 సినిమా లో హీరోయిన్‌ శృతి హాసన్ కనిపించేది ఎంత సమయం అంటే కేవలం 15 నుండి 20 నిమిషాలే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

Telugu Prabhas, Prashant Neel, Salaar, Shruti Haasa-Movie

దర్శకుడు ప్రశాంత్ నీల్( Director Prashanth Neel ) గతంలో రూపొందించిన కేజీఎఫ్‌ 1 లో కూడా హీరోయిన్‌ కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించింది.సెకండ్‌ పార్ట్‌ లో కాస్త ఎక్కువ సమయం ఆమెను చూడటానికి వీలు పడింది.అదే మాదిరిగా సలార్ 1 లో కూడా హీరోయిన్‌ గా నటించిన శృతి హాసన్( Shruti Haasan ) ను చాలా తక్కువ సమయం చూస్తామని, సినిమా పూర్తి గా ప్రభాస్ కనిపిస్తాడని యూనిట్ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ అన్నారు.ఈ విషయం శృతి హాసన్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయం అనడంలో సందేహం లేదు.

సలార్ సినిమా లో ప్రభాస్ ఫైట్స్ సన్నివేశాలు అబ్బుర పరిచేవిగా ఉంటాయి అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube