హమ్మయ్య మొత్తానికి ప్రభాస్( Prabhas ) బయటకు వచ్చాడు.సలార్ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టేశారు హీరో ప్రభాస్.
ప్రభాస్ నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22న విడుదల కాబోతుండగా ఈ సినిమా ప్రమోషన్స్ ని ఇంకా మొదలు పెట్టకపోవడంతో ప్రభాస్ అభిమానులు భయపడడంతో పాటు తీవ్ర ఆందోళన కూడా చెందారు.ప్రమోషన్స్ ని మొదలు పెట్టక పోవడం పట్ల అనేక రకాల అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.
కానీ ఆ అనుమానాలను వార్తలను పటాపంచలు చేస్తూ ప్రభాస్ తాజాగా సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టేశారు.దీంతో ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ మేరకు ప్రభాస్ సలార్ సినిమా గురించి స్పందిస్తూ.సలార్( Salaar ) సినిమాలో నా పాత్ర కోసం నేనేం ప్రత్యేకంగా కష్టపడలేదు.క్యారెక్టర్ డిమాండ్ మేరకు కండలు పెంచాలని ప్రశాంత్ ముందే చెప్పాడు.ఆయన చెప్పినట్లే నేను మారాను.అది నాకు సాధారణమైన విషయం.గత 21 ఏళ్లలో నేను మారిన దానితో పోల్చుకుంటే ఈ సినిమా కోసం నేను చేసింది చాలా సాధారణమైన విషయం.
ప్రశాంత్ నీల్ ప్లానింగ్ చూసి ఫిదా అయ్యాను.షాట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు.
నేను వెయిట్ చేస్తానని చెప్పినా కూడా ప్రశాంత్ వినలేదు అని చెప్పుకొచ్చారు ప్రభాస్.ముందుగానే అన్నీ ఏర్పాట్లు చేసుకునేవాడు.

ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు నేను ఎప్పుడు సెట్స్ లోకి అడుగు పెట్టానో నాకు గుర్తు లేదు.అయితే నేను ఎంటర్ అవగానే అంతా ఆపేసి నాపై సన్నివేశాలను తీయడానికి టీమ్ సిద్ధమైంది.తను అంతలా నన్ను కేరింగ్ గా చూసుకున్నాడు.పరిచయమైన నెల రోజులకే ప్రభాస్ కు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు.షూటింగ్ కు వెళ్లాలనే ఆలోచన కంటే, ప్రశాంత్( Prashanth Neel ) తో టైమ్ గడుపుతాననే ఆనందమే తనకు ఎక్కువగా ఉండేది.నా 21 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడూ ఇలా అనిపించలేదు.
ప్రశాంత్ అంతలా నాకు నచ్చేశాడు అని చెప్పుకొచ్చారు ప్రభాస్.ఈ మేరకు ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.