ప్రతీ ఒక్కరికి డ్రీమ్ హౌస్ అనేది ఉంటుంది.ఇది సెలెబ్రెటీలకు మాత్రమే కాదు మాములు ప్రజలకు కూడా తమకు తగ్గట్టు సొంత ఇల్లు కావాలని కోరుకుంటారు.
ఇక సెలెబ్రిటీలు అయితే వారి రేంజ్ లో డ్రీమ్ హౌస్ లను నిర్మించు కుంటారు.ఇక మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్( Prabhas ) కు కూడా తన లైఫ్ లో డ్రీమ్ హౌస్ అనేది ఉందట.
ఎప్పటి నుండో ఈయన ఫామ్ హౌస్ ను నిర్మించాలని ప్లాన్ చేసుకుంటున్నారట.
మరి ఇన్ని రోజులకు ప్రభాస్ తన డ్రీమ్ హౌస్ ను నిర్మించుకునే అవకాశం లభించింది అని తెలుస్తుంది.
ప్రభాస్ ఇప్పటికే హైదరాబాద్( Hyderabad ) శివార్లలో ఒక ఫామ్ హౌస్ ను కొన్నట్టు సమాచారం.దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫామ్ హౌస్ ను ప్రభాస్ ఇటీవలే కొన్నారట.
ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ నే అత్యాధునిక హంగులతో తీర్చి దిద్దుతున్నాడని టాక్.
అంతేకాదు ఈ ఫామ్ హౌస్ లో పెద్ద కొండ లాంటి ప్రదేశం ఉందని అక్కడ నుండి చూస్తే సిటీ లుక్ మొత్తం కనపడుతుంది అని టాక్.అందుకే ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నాడని.ఏకంగా విదేశీ నిపులతో చిన్నపాటి గుహ లాంటిది నిర్మించుకుంటున్నట్టు టాక్.
ఈ విషయం తెలిసిన వారంతా ఈ ఫామ్ హౌస్ ను ఇంకెన్ని హంగులతో నిర్మిస్తాడో అని ఆశ్చర్య పోతున్నారు.
ప్రస్తుతం తన తోటి హీరోలంతా తమ సంపాదన మొత్తం మరో దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ మరింత ఎక్కువ చేసుకోవాలని ఆశ పడుతుంటే ప్రభాస్ మాత్రం అలాంటివి ఏమీ చేయడం లేదు.కానీ తన డ్రీమ్ హౌస్ (Prabhas Dream House )కోసం ఖర్చు చేస్తూ సంతోష పడుతున్నారు.ప్రజెంట్ ఈయన సినిమాకు 100 నుండి 150 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.