Pooja Murthy : శివాజీ ఆడట్లేదు.. క్యారెక్టర్ వదిలేశాడు.. పూజామూర్తి సంచలన వ్యాఖ్యలు వైరల్!

బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రస్తుతం ఎనిమిదవ వారం కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఏడువారాలను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం నుంచి పూజా మూర్తి హౌస్ నుంచి బయటకు వచ్చారు.

 Pooja Murth Tollywood Bigg Boss Telugu Season 7 Shivaji Amar Deep Social Media-TeluguStop.com

వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఐదవ వారం హౌస్ లోకి వెళ్లినటువంటి పూజా మూర్తి( Pooja Murthy ) హౌస్ లోకి వెళ్ళిన రెండవ వారమే ఎలిమినేట్ అయ్యారు.ఇలా ఏడవ వారం ఎలిమినేట్ అయినటువంటి ఈమె వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ మూర్తి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ముఖ్యంగా హీరో శివాజీ( Shivaji ) గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Amar Deep, Biggboss, Pooja Murthy, Shivaji, Tollywood-Movie

శివాజీ హౌస్ లోకి వెళ్ళినప్పటి నుంచి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) కు పూర్తి సపోర్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇలా పల్లవి ప్రశాంత్ తో పాటు యావర్(Yawar ) ను కూడా సపోర్ట్ చేస్తున్నారు.ఈ సందర్భంగా యాంకర్ పూజా మూర్తిని ప్రశ్నిస్తూ కేవలం శివాజీ కారణంగానే ఆ ఇద్దరు ఆడుతున్నారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ హౌస్ లో శివాజీ గారి సపోర్ట్ వీళ్లిద్దరికి చాలా ఉందని తెలియజేశారు.

అయితే మనం కొంతవరకు మాత్రమే పుష్ చేయగలం కానీ శివాజీ మాత్రం కాస్త ఎక్కువగానే సపోర్ట్ చేస్తున్నారని పూజ వెల్లడించారు.శివాజి ఆడలేదు కానీ వీరి చేత ఆడిస్తున్నారని మీరు గేమ్ ఆడట్లేదు అంటూ నామినేట్ చేస్తే మాత్రం ఆయన ఒప్పుకోరని పూజ మూర్తి వెల్లడించారు.

Telugu Amar Deep, Biggboss, Pooja Murthy, Shivaji, Tollywood-Movie

ఇక అమర్ దీప్ ( Amar Deep ) గురించి కూడా పూజ మూర్తి మాట్లాడుతూ అమర్ గురించి నాకు బయట బాగా తెలుసు తనతో కలిసి నేను ఒక సీరియల్ లో కూడా చేశాను కానీ బయట ఎంతో అందగాడు అని గొప్పలు చెప్పుకునే అమర్ హౌస్ లో పూర్తిగా డీలా పడిపోయారు.హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అమర్ తన ఒరిజినల్ క్యారెక్టర్ వదిలేసుకున్నారని పూజా మూర్తి తెలియజేశారు.బయట నేను చూసిన అమర్ లోపల చూసిన అమర్ పూర్తిగా వేరని అమర్ తన ఆత్మవిశ్వాసం కోల్పోయారు అంటూ ఈ సందర్భంగా పూజ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube