నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయ రగడ రాజుకుంది.రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్లెక్సీలను 22వ డివిజన్ కార్పొరేటర్ చింపి వేసినట్లు తెలుస్తోంది.
వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్ధతు తెలిపిన కార్పొరేటర్ తాను జగన్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు.మరోవైపు ఎమ్మెల్యే కోటంరెడ్డి తన ఇంటికి వచ్చి సీరియస్ అయ్యారని, వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో విజయభాస్కర్ రెడ్డిని నగర డీఎస్పీ శ్రీనివాస రెడ్డి విచారిస్తున్నారు.సమాచారం అందుకున్న ఎంపీ ఆదాల ఇతర ముఖ్యనేతలతో కలిసి పీఎస్ వద్దకు చేరుకున్నారు.
దీంతో వేదాయపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది.