సత్యం రాజేష్( Satyam Rajesh ) ప్రధాన పాత్రలో రూపొందిన పొలిమేర కి మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే అప్పుడున్న పరిస్థితుల నేపథ్యం లో పొలిమేర ను డైరెక్ట్ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేయాల్సి వచ్చింది.
పొలిమేర సినిమా లోనే సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు.అన్నట్లుగానే కాస్త ఆలస్యంగా పొలిమేర 2( Maa Oori Polimera 2 ) సినిమా ను తీసుకు వచ్చారు.
ఇందులో కూడా సత్యం రాజేష్ తో పాటు పార్ట్ 1 లో నటించిన వారు చాలా మందిని రిపీట్ చేయడం జరిగింది.పొలిమేర 2 కి మొదటి నుంచి కూడా పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేడయం లో మేకర్స్ సఫలం అయ్యారు.

బన్నీ వాసు( Bunny Vasu ) వంటి ప్రముఖ నిర్మాత ఈ సినిమా ను సమర్పించేందుకు గాను ముందుకు వచ్చాడు అంటేనే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నట్లుగా ప్రచారం చేశారు.అన్నట్లుగానే సత్యం రాజేష్ కి ఒక మంచి సినిమా పడింది.పొలిమేర 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అంతే కాకుండా పొలిమేర 2 సినిమా కు వస్తున్న వసూళ్లు చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నైజాం ఏరియాలో మినహా మిగిలిన అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ వసూళ్లు నమోదు అయ్యాయి.ఈ వీకెండ్ వరకు నైజాం ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

చిన్న సినిమా అయినా కూడా భలే పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.ఆకట్టుకునే కథ మరియు హర్రర్ ఎలిమెంట్స్ కారణంగా సినిమా కి మంచి రెస్పాన్స్ వస్తోంది.ప్రస్తుతం ఉన్న వసూళ్లు.వస్తున్న వసూళ్లు చూస్తూ ఉంటే భారీ విజయం దిశగా పొలిమేర 2 పోతుందని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.ఈ జోష్ తో పొలిమేర 3 కూడా చేయాలని మేకర్స్ కి ఆడియన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.