మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు అఖిలప్రియ, భార్గవ్ రామ్ లను కస్టడీ కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో పిటిషన్ ను నంద్యాల కోర్టు సోమవారానికి వాయిదా వేసినట్లు సమాచారం.
నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో భూమా అఖిలప్రియ కర్నూలు సబ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.
మొత్తం ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు అరెస్ట్ కాగా మరో ఐదుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.