అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.పాదయాత్రను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ అమరావతి జేఏసీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ లో మార్పులు చేయాలని సూచించింది.అదేవిధంగా మహా పాదయాత్ర సాఫీగా జరిగేందుకు పోలీసులు, యాత్ర నిర్వాహకులు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది.అమరావతి రైతుల పిటిషన్ పై వాదనలు రేపు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.