హైదరాబాద్ భాగ్యలక్ష్మీ ఆలయానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.సాయంత్రం 6 గంటలకు ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉంటానన్నారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా ఆలయానికి రావాలని సవాల్ చేశారు.ఈటల ఆరోపించినట్లు బీఆర్ఎస్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపారు.
రాజకీయాల కోసమే ఈటల దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అయితే కాంగ్రెస్, బీజేపీ మధ్య మునుగోడు మంటలు రాజుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఈటల, రేవంత్ రెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.