పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటంతో ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ చిత్రాన్ని పవన్ తెలుగులో వకీల్ సాబ్ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.
వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేద్దామని చిత్ర యూనిట్ తొలుత అనుకున్నారు.కానీ లాక్డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుంది.ఇక ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేందుకు పవన్ మరో 8 రోజుల షూటింగ్ చేయాల్సి ఉందని చిత్ర యూనిట్ అంటోంది.ఈ 8 రోజుల షూటింగ్ పూర్తిచేస్తే చిత్ర షూటింగ్ ముగుస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.
మొత్తానికి వకీల్ సాబ్ కోసం పవన్ మరో 8 రోజులు కేటాయిస్తే సరిపోతుందని తెలుస్తోంది.వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా నివేదా థామస్, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.