టిడిపి, జనసేన పొత్తులు భాగంగా కొన్ని కొన్ని కీలక నియోజకవర్గల్లో సీట్ల పంపకాల విషయంలో వివాదాలు ఏర్పడుతున్నాయి.ముఖ్యంగా టిడిపి సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని నియోజకవర్గాల విషయంలో ఈ తలనొప్పులు మొదలయ్యాయి.
ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నుంచి టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి( Gorantla Butchaiah Chowdary )ని ఈసారి తప్పిస్తారని,అక్కడ జనసేనకు అవకాశం ఇస్తారనే ప్రచారం చాలా కాలం నుంచి జరుగుతోంది.అందుకు తగ్గట్లుగానే రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించిన సందర్భంగా రాజమండ్రి రూరల్ సీటు విషయమై కీలక ప్రకటన చేశారు.
వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి పోటీ చేయడం ఖాయమని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం, రాజమండ్రి రూరల్ సీట్లలో జనసేన అభ్యర్థులే పోటీలో ఉంటారని పవన్ ప్రకటించారు.రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ పోటీలో ఉండబోతున్నట్లుగా పవన్ ప్రకటించడంతో, ఈ సీటు విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది.
మొదటి నుంచి రాజమండ్రి రూరల్ పై జనసేన ఆశలు పెట్టుకుంది.
ఇక్కడ కందుల దుర్గేష్( Kandula Durgesh ) నియోజకవర్గమంతా పర్యటిస్తూ, తానే పోటీలో ఉండబోతున్నట్లుగా ప్రకటిస్తున్నారు.దీనికి బుచ్చయ్య కౌంటర్లు ఇచ్చారు.తాను టిడిపిలో సీనియర్ అని, తనను ఎవరు మార్చలేరని, సీటు విషయంలో ఎవరు ఎన్ని ప్రకటనలు చేసినా, తానే పోటీలో ఉంటాను అంటూ ప్రకటిస్తూ వస్తున్నారు.
దీనికి తగ్గట్లు గానే గతంలో టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్ ఇవానున్నట్టు చంద్రబాబు ప్రకటించడాన్ని బుచ్చయ్య గుర్తు చేస్తున్నారు.రాజమండ్రి పట్టణ నియోజకవర్గంలో నుంచి ఆదిరెడ్డి కుటుంబంలో ఒకరికి టికెట్ ఇవ్వడం ఖాయం కావడంతో, బుచ్చయ్య విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.
టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీలో బుచ్చయ్య చౌదరి ఉన్నారు.
చంద్రబాబు కంటే పార్టీలో సీనియర్ నేత ఆయన.సుదీర్ఘకాలం నుంచి రాజమండ్రి నుంచే ఆయన రాజకీయాలు చేస్తున్నారు.ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేనకు బుచ్చయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ సీటును కేటాయించబోతుండడంతో వివాదం మొదలైంది.
అయితే ఆదిరెడ్డి కుటుంబాన్ని రాజమండ్రి పార్లమెంట్ కు పోటీ చేయించి, పట్టణ నియోజకవర్గాన్ని బుచ్చయ్యకు ఇచ్చే ఆలోచన చంద్రబాబు( Chandrababu Naidu )లో ఉన్నా.ఆదిరెడ్డి కుటుంబం మాత్రం పార్లమెంటుకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపించకపోవడంతో, బుచ్చయ్యను ఏ విధంగా బుజ్జగిస్తారు అనేది తేలాల్సి ఉంది.
పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తామని హామీని ఇచ్చి బుచ్చయ్యకు నచ్చ చెప్పే అవకాశం ఉన్నట్లుగా టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.