బజాజ్ కంపెనీ తమ యాడ్ లను న్యూస్ ఛానల్ లలో ప్రచారం చేయమని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా పార్లే కంపెనీ కూడా ఈ జాబితాలో చేరింది.
పార్లే జీ బిస్కెట్ తయారీ సంస్థ అయిన పార్లే కంపెనీ న్యూస్ ఛానెల్ లో వారి యాడ్ లను ప్రచారం చేయమని తెలిపింది.దీనికి కారణం ఆ న్యూస్ ఛానల్ లు ప్రచారం చేస్తున్న ‘టాక్సిక్ కంటెంట్’ కారణం అని పార్లే కంపెనీ సీనియర్ హెడ్ కృష్ణారావు బుద్ధ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ మా కంపెనీ ఇలాంటి న్యూస్ ఛానల్స్ పై తమ డబ్బును వృధా చేసుకోమని, ఆ ఛానల్స్ వల్ల తమ కస్టమర్ లకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు.ఈ ప్రకటన ద్వారా పార్లే ట్విట్టర్ లో ట్రేండింగ్ గా నిలిచింది.
చాలా మంది పార్లే ను ” సోషల్ రెస్పాన్సిబుల్ బ్రాండ్” అని అంటున్నారు, మరికొందరు దీనిని చాలా అవసరమైన అడుగు గా పేర్కొంటున్నారు.పార్లే కంటే ముందు బజాజ్ కంపెనీ హెడ్ రాజీవ్ బజాజ్ CNBC-TV18 తో తాము 3 ఛానల్ లను బ్లాక్ లిస్ట్ లో పెట్టామని, వారితో యాడ్ లు ఇకపై చేయమని తెలిపారు.