ప్రపంచ వ్యాప్తంగా భారతీయ వంటకాలకు ఫిదా అవ్వని వ్యక్తి ఉండడు.విదేశాలలో ఉండే భారతీయ సాంప్రదాయ రెస్టారెంట్లకు భారతీయులకంటే కూడా విదేశీయులే వెళ్తూ ఉంటారు.
మనం వంటలలో వాడే మసాలా దినుసులు, ప్రాంతాలకు తగ్గట్టుగా చేసే రకరకాల వంటలు, రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి అందుకే యావత్ ప్రపంచం మొత్తాన్ని మన వంటకాలు ఆకర్షించాయి.ఎంతో మంది విదేశీయులు మన వంటకాలు నేర్చుకోవడానికి తర్ఫీదులు కూడా పొందుతుంటారు.
అయితే మన వంటకాలపై ఓ అమెరికన్ సెలబ్రిటీ నోటికి వచ్చినట్లు మాట్లాడారు.ఎన్నో విమర్శలు చేశారు.
జీన్ వైన్ గార్టెన్ అనే సెలబ్రిటీ ప్రఖ్యాత వాషింగ్టన్ పోస్ట్ కు ఓ వ్యాసం రాశారు.అందులో భారతీయ వంటకాలను విమర్శిస్తూ భారతీయ వంటలు అన్నీ ఒకే రకమైన మసాలాతో చేస్తారని, ఏ మాత్రం మార్పు ఉండదంటూ వ్యాసం రాసుకొచ్చాడు.
అయితే ఈ విషయంలో ఎవరూ పెద్దగా స్పందించారు అనుకున్నాడో ఏమో నోటికి వచ్చినట్లు మాట్లాడటంతో ప్రముఖ రచయితా అమెరికన్ టెలివిజన్ పర్సనాలిటీ పద్మ లక్ష్మి ఘాటుగానే స్పందించారు.జీన్ కు ఏమొచ్చిందనే విషయం నాకు తెలియదు కానీ అతడు హద్దులు మీరుతున్నాడు అని మాత్రం నాకు అర్థమవుతోందని ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అతడు రాసిన వ్యాసం మొత్తం జాత్యాహంకారాన్ని ఆణువణువూ నింపుకున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోందని ఘాటుగా రిప్లై ఇచ్చారు.ఇలాంటి వ్యాసం పబ్లిష్ చేసిన వాషింగ్టన్ పోస్ట్ పై కూడా ఆమె ఘాటుగా స్పందించారు.

130 కోట్ల మంది ఉన్న భారత దేశాన్ని, మా సంస్కృతీ సాంప్రదాయలను అవమానించడం ఆ ఆర్టికల్ ను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించడం సరైన పద్దతి కాదంటూ ఆమె విరుచుకుపడ్డారు.పద్మ లక్ష్మి తో పాటు ఆమెకు భారతీయ సమాజం అండగా నిలిచింది.వ్యాసం రాసిన సదరు వ్యక్తిపై విమర్శలు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు భారతీయులు ఈ ఘటనపై స్పందించిన వాషింగ్టన్ పోస్ట్ ఈ వ్యాసం పై సవరణలు చేస్తామని, తప్పులు సరిచేస్తామని ప్రకటించింది.