రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.నిర్మాతలకు ఈ సినిమా ఊహించని స్థాయిలో లాభాలను అందించింది.
అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే పుష్ప2 మూవీ వల్ల గేమ్ ఛేంజర్ కు( Game Changer ) భారీ షాక్ తగలడం గమనార్హం.
అయితే సంధ్య థియేటర్( Sandhya Theatre ) ఘటన నేపథ్యంలో సంధ్య థియేటర్ పరిసర ప్రాంతాలలో డీజేలు, బ్యానర్లు, డప్పులు, క్రాకర్స్, పూల దండాలు, కటౌట్లు పెట్టడానికి వీలు లేదని పోలీసులు ఆదేశించారు.పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో ఇలాంటి అంంక్షలు అమలులోకి రావడం కొసమెరుపు.
సంధ్య 35 ఎం.ఎం.పరిసర ప్రాంతాలలో ఎలాంటి సెలబ్రేషన్స్ జరిగినా పోలీసుల నుంచి అనుమతులు పొందాలని ఆదేశించారు.
థియేటర్ లో ఎలాంటి ఘటనలు జరిగినా తమదే బాధ్యత అని నిర్వాహకులు డాక్యుమెంట్ రాసి ఇవ్వాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.మరోవైపు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ బుకింగ్స్ రేపటి నుంచి మొదలుకానున్నాయి.దిల్ రాజు, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
దిల్ రాజుకు( Dil Raju ) ఈ సినిమా ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి.
దాదాపుగా మూడున్నర సంవత్సరాల పాటు ఈ సినిమా షూటింగ్ జరగడం గమనార్హం.ఈ సినిమా సోలో హీరోగా చరణ్( Ram Charan ) మార్కెట్ ను డిసైడ్ చేయనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ కథ, కథనం కొత్తగా ఉంటాయని సమాచారం అందుతోంది.శంకర్ ఈ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని ఆయన అభిమానులు బలంగా నమ్ముతున్నారు.