75 ఏళ్ల వయసులో శీర్షాసనం వేసిన వృద్ధుడు.. ఆ రికార్డు బద్దలు.. వీడియో వైరల్!

వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అనే మాటలను ఎప్పటికప్పుడు ప్రజలు నిరూపిస్తూనే ఉన్నారు.తాజాగా ఒక 75 ఏళ్ల వృద్ధుడు యోగాలో అత్యంత కష్టమైన శీర్షాసనం వేసి ఆశ్చర్య పరిచాడు.

 Oldest Person To Perform A Headstand 75-year-old Tony Helou Details, Old Men, V-TeluguStop.com

ఇందుకుగాను అతని పేరు మీద గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ అయ్యింది.దీనికి సంబంధించిన వీడియోని గిన్నిస్ రికార్డ్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది.“ఓల్డెస్ట్ పర్సన్ టు డూ హెడ్‌స్టాండ్. 75 ఇయర్ ఓల్డ్ టోనీ హెలౌ” అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఒక క్యాప్షన్ జోడించింది.

ఈ వీడియోలో అత్యంత సునాయాసంగా 75 ఏళ్ల టోనీ శీర్షాసనం వేయడం చూడొచ్చు.

సాధారణంగా శీర్షాసనం సరిగ్గా వేయాలంటే చాలా సాధన అవసరం.

ఈ యోగాససాన్ని సరిగ్గా నేర్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది.కొంచెం పొరపాటు జరిగినా తీవ్రమైన గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంది.

అందుకే నిర్దిష్ట వయస్సు దాటిన వాళ్లు కూడా ఇలాంటి ఆసనాలకు దూరంగా ఉంటారు.నిజానికి 60 ఏళ్ల పైబడిన తర్వాత ఈ ఆసనం చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది.

కానీ టోనీ మాత్రం తన 75 ఏళ్ల వయసులో ఈ ఫీట్ సాధించి యావత్ ప్రపంచాన్ని నోరెళ్లబెట్టిస్తున్నారు.

ఈ స్ఫూర్తిదాయకమైన వీడియో చూసి నెటిజన్లు టోనీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ వృద్ధుడిని చూసి అయినా యువకులు యోగ సాధనపై దృష్టి పెడతారని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.శీర్షాసనం సరైన సమయంలో సరిగా చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

కానీ ఈ రోజుల్లో ఇలాంటి అద్భుతమైన యోగాసనాలుకు తగినంత ప్రాముఖ్యత లభించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube