ఎన్నారైలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.ఆధార్ కార్డు కోసం అప్ప్లై చేసే ఎన్నారైలు ఇకపై ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఎన్నారైలు ఆధార్ కార్డ్ కోసం అప్ప్లై చేస్తే నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్న తరుణంలో ఎంతో మంది భారత ఎన్నారైలు కేంద్రానికి తమకు ఆధార్ జారీ విషయంలో జాప్యం జరగకుండా త్వరితగతిన అయ్యేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.దాంతో స్పందించిన కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఎన్నారైలు ఆధార్ కార్డ్ కోసం అప్ప్లై చేస్తే దాదాపు 6 నెలల పాటు వేచి చూడాల్సి వచ్చేది కానీ తాజాగా నిర్ణయంతో ఆధార్ కోసం ఎన్నారైలు అప్ప్లై చేసిన వెంటనే అందించేలా చర్యలు చేపట్టింది.ఈ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా ( యూఐడిఏఐ ) ఓ ప్రకటన విడుదల చేసింది.
ఎన్నారైలు ఎవరైనా సరే స్వదేశానికి వచ్చిన వెంటనే ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.అయితే ఆధార్ కార్డ్ నమోదు కోసం వెళ్ళే వారు తప్పకుండా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం తప్పనిసరిగా ఇండియన్ పాస్ పోర్ట్ తీసుకువెళ్లాలని తెలిపింది.
మీ వద్ద అన్ని అర్హతలు ఉంటే.ఇండియన్ పాస్ పోర్టు తో దగ్గరలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్ళవచ్చని తెలిపింది.
అలాగే ఆధార్ నమోదు విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా, సమస్యలు ఉన్నా 1947 నెంబర్ కు కాల్ చేయవచ్చునని అలాగే “ help@uidai.gov.in కు ఈ మెయిల్ చేయవచ్చునని యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.
అంతేకాదు ఆధార్ నమోదు చేసుకునే వారికి కొన్ని సూచనలు కూడా చేసింది.అదేంటంటే, ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్ళేటప్పుడు మీ భారత పాస్ పోర్ట్ తీసుకువెళ్ళాలని, అలాగే అక్కడ ఆధార్ నమోదు పత్రాన్ని నింపాలని, తప్పనిసరిగా మీ ఈ మెయిల్ ఐడీ లు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది.