అతుల్ అనే ఒక ఎన్నారై స్టూడెంట్ డాక్టర్ కావాలనే లక్ష్యంతో లండన్‌కు వెళ్లి చదువుతున్నాడు.అయితే డాక్టర్ చదువుతున్నా మెడిసిన్ కెరీర్ తీసుకోవాలా లేదంటే బిజినెస్ చేసుకోవాలా అనే ఒక సందేహంలో అతడు ఉండేవాడు.
అదే సమయంలో అతని గుండె ఆరుసార్లు పనిచేయడం ఆగిపోయింది.యూకేలోని పేరొందిన కార్డియాలజిస్టులు అతని ప్రాణాలను కాపాడారు.
ఈ స్టూడెంట్ పేరు అతుల్ రావు.( Atul Rao ) సీటెల్‌కు చెందిన అతుల్ టెక్సాస్‌లోని బేలర్ యూనివర్సిటీలో చదువుతున్నాడు.
దురదృష్టం కొద్దీ అతనికి ఊపిరితిత్తులలో సమస్య వచ్చింది.రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి రక్తం గుండెకు చేరకుండా ఆగిపోయింది.
ఈ సమస్యను పల్మనరీ ఎంబోలిజం ( Pulmonary embolism )అంటారు.ఆ సమస్య వల్ల ఒక రోజు అతని గుండె పని చేయడం మానేసింది.
అతుల్ జులై 27న ఛాతీ నొప్పితో కుప్పకూలినట్లు గుర్తించారు.అంబులెన్స్ వచ్చే వరకు సెక్యూరిటీ గార్డు అతనికి సీపీఆర్( CPR ) ఇచ్చాడు.ఆపై లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ హెల్త్‌కేర్ ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్ట్ హామర్స్‌మిత్ హాస్పిటల్ కు తరలించారు.గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి మెరుగైన వైద్యం అందించడంలో ఆస్పత్రి డాక్టర్లు వారికి వారే సాటి.
వైద్యులు కొన్ని పరీక్షలు చేసి ఊపిరితిత్తుల్లో అడ్డంకులు ఉన్నట్లు గుర్తించారు.ఆపై అతని ప్రాణాలను కాపాడారు.తరువాత, అతుల్ తన తల్లిదండ్రులతో తిరిగి ఆసుపత్రికి వచ్చి వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు.
“ఇది జరగడానికి ముందు, నేను డాక్టర్ కావాలనుకున్నా కానీ మనస్ఫూర్తిగా అనుకోలేదు.కానీ ఇప్పుడు ఇష్టంతో డాక్టర్ కావాలనుకుంటున్నా.బతికేందుకు సెకండ్ ఛాన్స్ ఇచ్చిన ఈ అవకాశంతో ఇతర వ్యక్తులకు సహాయం చేయాలనుకుంటున్నా.” అని చెబుతూ డాక్టర్ల ముందు అతుల్ ఎమోషనల్ అయ్యాడు.నిజానికి ఆసుపత్రికి తరలించే సమయానికి రావు పరిస్థితి విషమంగా ఉంది.
అతడిని బతికించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించి, సెయింట్ థామస్( Saint Thomas ) ఆసుపత్రికి తరలించి, అవసరమైతే మరింత సహాయం పొందవచ్చన్నారు.అతనికి క్లాట్-బస్టింగ్ డ్రగ్స్, ఇతర లైఫ్ సపోర్ట్ మెషీన్లు ఇచ్చారు.
చివరికి ECMO అవసరం లేకుండానే కోలుకున్నాడు.ఇంపీరియల్ కాలేజ్ హెల్త్‌కేర్ ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్ట్ హామర్స్‌మిత్ హాస్పిటల్‌లోని క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ డాక్టర్ లూయిట్ ఠాకూరియా మాట్లాడుతూ, రావు ప్రాణాలను కాపాడేందుకు ఇది ఒక టీమ్ ఎఫర్ట్ అని, అందులో అతను భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.