మనసును అదుపులోకి పెట్టుకోక పొతే ఎన్నో అనర్ధాలు జరుగుతాయి, నష్టం జరిగిన తరువాత ఎంత పశ్చాత్తాప పడినా ఎలాంటి ఉపయోగం ఉండదు.ఈ విషయం అందరికి తెలిసిందే.
అగ్ర రాజ్యం అమెరికాలో ఓ భారతీయుడికి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.అమ్మాయిలపై తనకు ఉన్న మోజు చివరికి అతడిని జీవితాన్ని తలకిందులు చేసేంది.
అతడు చేసిన నేరం నేరుగా సాక్ష్యాదారాలతో సహా రుజువవ్వడంతో అమెరికాలో ఓ వలస వాసుడికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జైలు శిక్షను విధించింది అమెరికా కోర్టు.
వివరాలలోకి వెళ్తే అమెరికాలో స్థిరపడిన కేరళకు చెందిన ప్రదీష్ సెల్వరాజ్ అనే వ్యక్తి మంచి ఉన్నత స్థాయిలో అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారు.
అయితే బుద్దిని, మనసును అదుపులో ఉంచుకోలేని సెల్వరాజ్ మైనర్ బాలికలపై మోజు పడ్డాడు, దాంతో ఆన్లైన్ లో 15 ఏళ్ళ బాలికల గురించి వెదకడం మొదలు పెట్టాడు.ఈ క్రమంలోనే ఆన్లైన్ లో ఆకర్షించేలా అమ్మాయిలకు సంభందించి ఓ వెబ్సైటు కనిపించింది.
దాంతో అందులోని నెంబర్ ను సంప్రదించారు సెల్వరాజ్.అతడు పెట్టిన మెసేజ్ కు స్పందించిన సదరు వ్యక్తులు.
సెల్వరాజ్ కు మైనర్ బాలికను పంపడానికి సిద్దమయ్యారు.సెల్వరాజ్ ఒక మైనర్ బాలిక సరిపోరని మరొక అమ్మాయి కూడా కావాలని అందుకు గాను 80 డాలర్లు ఇవ్వడానికి సిద్దమని తెలిపాడు.
ఒప్పందం కుదిరిన తరువాత ఆ ఇద్దరు అమ్మాయిలను కలవడానికి సెల్వరాజ్ ఒమహాలోని ఓ రెస్టారెంట్ కు వెళ్ళాడు.వారితో కలిసి మాట్లాడుతున్న సమయంలో ఊహించని విధంగా పోలీసులు సెల్వరాజ్ ముందుకు హాజరయ్యారు.
పోలీసులు ఇలాంటి వారిని పట్టుకోవడానికి పక్కా వ్యూహం ప్రకారమే ఇలాంటి వెబ్ సైట్ ఉపయోగిస్తున్నారో లేక ఎవరైనా సమాచారం ఇచ్చారోగానీ మొత్తానికి సెల్వరాజ్ అరెస్ట్ అయ్యాడు.పక్కా సాక్ష్యాధారాలు ఉండటంతో అమెరికా కోర్టు అతడికి 10ఏళ్ళ జైలు శిక్ష, విడుదల అనంతరం 5 ఏళ్ళ పాటు పోలీసుల అబ్జర్వేషన్ తో పాటు తదనంతరం అమెరికా నుంచీ అతడిని బహిష్కరించాలని తీర్పు ఇచ్చింది.