విశాఖ ఉక్కు పై కేంద్రం యు టర్న్; తగ్గేదే లేదంట

విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha Steel Plant) వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్ర వెనక్కి తగ్గిందని ఆ దిశగా ఉక్కు శాఖా సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్( Minister Faggan Singh ) వ్యాఖ్యలు చేశారంటూ నిన్న మీడియాలో జోరుగా వార్తలు ప్రసారం అయ్యాయి.

 No Back Step In Vizag Steel : Confirmed By Central Govt , Central Govt ,visakha-TeluguStop.com

ఆ ఘనత మాదంటే మాదంటూ బారాస ,జనసేన పార్టీలతో పాటు అధికార పార్టీ కూడా క్లెయిమ్ చేసుకోంది .దాదాపు అన్ని ప్రముఖ మీడియా ఛానల్లో ఈ విషయాన్ని కవర్ చేయడంతో పాటు ఈ క్రెడిట్ ఎవరి ఖాతా లో వేయాలంటూ డిబేట్ కూడా నడిపాయి దాంతో కేంద్ర ప్రభుత్వం( Central Govt ) నిజంగానే ఈ విషయంపై వెనుకకు తగ్గిందని కేసీఆర్ ఈ విషయాన్ని కేంద్ర స్థాయి ఉద్యమంగా మలచాలని భావించడంతో వ్యూహాత్మకంగా కేంద్రం .

Telugu Central, Faggan Singh, Visakha Steel-Telugu Political News

ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని భావించిందంటూ విశ్లేషణలు వచ్చాయి జేడీ లక్ష్మీనారాయణ( JD Lakshminarayana ) లాంటి వారైతే కేసీఆర్( KCR) ప్రవేశం తోనే ఈ విషయం లో కేంద్రం స్పందించిందని ట్విటర్ లో ఆయనుకు థాంక్స్ కూడా చెప్పారు.గత కొన్ని నెలలుగా ఈ విషయం లో పోరాటాలు చేతున్న ఉద్యమకారుల ఆనందాలకు హద్దు లేకుండా పోయింది విశాఖ వాసులు కూడా ఈ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశారు.అయితే 24 గంటలు గడవక ముందే కేంద్రం ఈ విషయంలో తగ్గేదే లే అంటూ ప్రకటించి వారికి షాక్ ఇచ్చింది .

Telugu Central, Faggan Singh, Visakha Steel-Telugu Political News

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ముందుకే వెళ్తున్నామని పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తుందని షెడ్యూల్ ప్రకారం నిర్ణేత కంపెనీ ద్వారా జరుగుతుందని ఈ విషయంలో వదంతులకు తావు లేదని కేంద్రం స్పష్టం చేసింది.దీనిపై విశాఖ వాసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నమ్మించి మోసం చేశారంటూ ఆందోళనకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మరోసారి నేర్పాలని దిశగా వారు సమాయత్తమవుతున్నారు.

మరి కేంద్రాన్ని వెనక్కి పంపిన ఘనత తమదే అంటూ క్లెయిమ్ చేసుకున్న పార్టీల స్పందన ఈ విషయంలో ఎలా ఉంటుందో వేచి చూడాలి.తమ ఎంట్రీ తో కేంద్ర ఎగ్జిట్ అయిందంటూ జబ్బులు చరుచుకున్న గులాబీ శ్రేణులు ఈ విషయంలో ఎలా స్పందిస్తాయో మరి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube