Dismantling Global Hindutva హిందుత్వాన్ని ఎలా కూల్చాలి.అమెరికాలో సెప్టెంబర్ 10 నుంచీ ఈ అంశంపై ఓ పెద్ద చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కొందరు మేధావులు.
ఇందులు నిపుణులు కూడా హాజరవుతున్నారని, జర్నలిస్టులు, అరప మేధావులు అందరూ వ్యాఖ్యానిస్తారని తెలియడంతో ఒక్కసారిగా అమెరికాలో ఉన్న హిందువులు బగ్గుమన్నారు.హిందుత్వవాదులు అందరూ రోడ్లపై నిరసనలు ప్రదర్శించారు.
దాంతో ఇప్పుడు ఈ కార్యక్రమం అమెరికాలో హాట్ టాపిక్ అయ్యింది.ప్రతీ ఒక్క హిందువూ ఈ చర్చపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.ఇదిలాఉంటే
Dismantling Global Hindutva పై ఇండో అమెరికన్ సెనేటర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఈ చర్చా కార్యక్రమం ఖచ్చితంగా హిందువులను కించపరుస్తూ, హిందుత్వాన్ని అవమానించడానికి ఏర్పాటు చేశారని మండిపడ్డారు.
అమెరికాలోని ఒహియో స్టేట్ సెనేటర్ నీరజ్ అంతాని ఈ చర్చా కార్య్రక్రమం ఏర్పాటు పై తీవ్ర అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు.హిందువులపై ఈ కార్యక్రమం ఓ నీచమైన దాడి చేయడానికి ఏర్పాటు చేసిందని, జాతి విద్వేషం రెచ్చగొట్టేలా ఉందని దీన్ని అందరూ ఖండించాలని, హిందుత్వంపై ఇంత ఉన్మాదమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

హిందుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమం జరిగినా తాను తప్పకుండా నిలబడుతానని తెలిపారు.హిందువులు అందరూ ఈ విషయంలో ఏకం కావాలని కోరారు.ఈ కార్యక్రమానికి స్పాన్సర్ షిప్ ఇచ్చిన యూనివర్సిటీలు తమ స్పాన్సర్ షిప్ ను వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.దాంతో పలువురు భారతీయ అమెరికన్స్ సదరు యూనివర్సిటీ లు తమ స్పాన్సర్ షిప్ వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ మెయిల్స్ పెడుతున్నారు.
అయితే అమెరికాలో హిందువుల తరుపున నిలబడిన నీరజ్ అంతాని ఒహియో సెనేటర్ ఎన్నికల చరిత్రలో మొట్టమొదటి సారిగా గెలిచిన ఏకైక భారతీయుడుగా రికార్డ్ సృష్టించారు,అలాగే హిందువుల తరుపున నిలబడి మాట్లాడిన ఏకైక సెనేటర్ గా వార్తల్లో నిలిచారు.