మేడం కొణిదెల కమర్షియల్ టచ్‌ ను మెగా ఫ్యాన్స్ అంగీకరించేనా?

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక్క అమ్మాయి నిహారిక.( Niharika ) చాలా సినిమాల్లో నటించింది కానీ ఏ ఒక్కటి కూడా ఆమెకు కమర్షియల్ గా హిట్ ను తెచ్చి పెట్టలేదు.

 Niharika Konidela Going To Do Commercial Heroine Roles Details, Niharika, Mega H-TeluguStop.com

దాంతో ఆమె హీరోయిన్‌ గా సినిమా లు చేయడం మానేసింది.అదే సమయంలో ఆమె వివాహం కూడా జరిగింది.

వివాహం జరిగిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయింది.ఇక ఆమె నటనకు స్వస్థి చెప్పినట్లే అని అంతా అనుకున్నారు.

కానీ భర్త నుంచి విడి పోయి మళ్లీ నటన వైపు అడుగులు వేసింది.ఆ మధ్య ఒక వెబ్‌ సిరీస్ లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పుడు సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.నటిగా ఆమె కెరీర్‌ మళ్లీ పుంజుకోవడం ఖాయం అన్నట్లుగా రీ ఎంట్రీ మూవీ వాట్ ది పిష్‌( What The Fish ) అనే సినిమా ఫస్ట్‌ లుక్ ఉంది.గతంలో సినిమా లో నటించిన సమయంలో పద్దతి అయిన డ్రెస్‌ ల్లో కనిపించింది.కానీ ఇప్పుడు ఓ రేంజ్‌ స్కిన్‌ షో చేస్తోంది.థైస్ అందాలను చూపిస్తూ క్లీ వేజ్‌ షో చేసిన ఫోటో ను ఫస్ట్‌ లుక్ గా విడుదల చేయడం జరిగింది.ఏకంగా తమన్నా రేంజ్ లో లాంగ్‌ షాట్ లో నిహారిక ఉండటం తో అంతా కూడా వావ్‌ అంటున్నారు.

అయితే మరీ ఇంత కమర్షియల్‌ టచ్ తో, అందాల ఆరబోతతో నటిస్తే కచ్చితంగా మెగా ఫ్యాన్స్( Mega Fans ) నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి.కనుక ఆ వ్యతిరేకతను ఎలా నిహారిక తట్టుకుంటుంది.ముందు ముందు రెగ్యులర్ కమర్షియల్‌ హీరోయిన్ గా ఎలా చేస్తుంది అనేది అందరి ముందు ఉన్న ప్రశ్న.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న వాట్‌ ది ఫిష్ లో నిహారిక పాత్ర చాలా విభిన్నంగా కాస్త బోల్డ్‌ గా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రం లో మంచు మనోజ్( Manchu Manoj ) కీలక పాత్ర లో నటించడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube