భారత్ నుంచీ ఎంతో మంది అగ్ర రాజ్యం అమెరికాకు ఉద్యోగ, వ్యాపార, విద్య రిత్యా వలసలు వెళ్తూ ఉంటారు.అలా వలసలు వెళ్ళిన ఎంతో మంది భారతీయులు అక్కడ వివిధ రంగాలలో స్థిరపడ్డారు.
అయితే ఇలా భారత్ నుంచీ అమెరికాకు వలసలు వెళ్ళిన వారు తమ చక్కని ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఎంతో ఉన్నత స్థానాలలో ఉన్నారు.అక్కడి రాజకీయ, వ్యాపార, ఉద్యోగ రంగాలలో భారతీయుల ప్రభావం ఎంతో ఉంటుంది.
అయితే ఆర్ధికంగా స్థిరపడిన భారతీయులు క్రమక్రమంగా సంపాదనలో అమెరికన్స్ ను కూడా పక్కకు నెట్టి అగ్ర స్థానంలో నిలిచారట.
వివరాలలోకి వెళ్తే అగ్ర రాజ్యం అమెరికాలో అమెరికన్స్ కంటే కూడా భారతీయులు ఆర్ధికంగా ఎంతో ఉన్నత స్థానాలలో ఉన్నారని.అక్కడి భారతీయుల సగటు సంపాదన ఏడాదికి దాదాపు రూ.91 లక్షలుగా ఉందని, గత ఏడాదితో పోల్చితే ఈ సారి ఈ సంపాదన మరింత రెట్టింపు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ తన సర్వే ఆధారంగా వెల్లడించింది.అంతేకాదు అక్కడి మధ్య తరగతి వారితో పోల్చినా మన భారతీయ మధ్య తరగతి వారే అత్యధికంగా సంపాదిస్తున్నారని, ఇతర ఆసియా దేశాల వారితో పోల్చి చూసినా భారతీయులే టాప్ ప్లేస్ లో ఉన్నారని తెలిపింది.

ఇదిలాఉంటే తైవాన్ వలస వాసుల సంపాదన సగటున ఏడాదికి రూ.72 లక్షలు ఉండగా, ఫిలిపీన్స్ వలస వాసుల సంపాదన రూ.70 లక్షలు ఉందని తెలిపింది.ఇక అమెరికన్స్ సంపాదన ఏడాదికి రూ.29 లక్షలు ఉన్న కుటుంభాలు 33 శాతం ఉన్నాయని అయితే ఇదే రూ.29 లక్షల సంపాదన భారతీయ కుటుంబాలలో 14 శాతం మంది సంపాదిస్తున్నారని ప్రకటిచింది.అంతేకాదు అమెరికాలో రానురాను ఆసియన్ల జనాభా విపరీతంగా పెరిగిపోతోందని, అమెరికాలో దాదాపు 40 లక్షల మంది భారతీయులు ఉన్నారని వెల్లడించింది.
వీరిలో దాదాపు 10 లక్షల మంది అక్కడే పుట్టిన వారేనని తన కధనంలో ప్రచురించింది.