టాలీవుడ్ బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల గురించి తెలియని వారెవ్వరూ లేరు.ఇక ఈమె యాంకరింగ్ చేసే విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే.
తన మాటలతో అందరిని ఆకట్టుకుంది.ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.
బుల్లితెరపై మాత్రం స్టార్ గా నిలిచింది.
ఆమె వేసే పంచ్ లు మాత్రం ఓ రేంజ్ లో పేలుతాయి.సుమ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తీరికలేని లైఫ్ గడుపుతున్న సుమ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది.ఇప్పటివరకు తన యాంకరింగ్ విషయంలో కానీ, తన మాటల్లో గాని ఎటువంటి నెగటివ్ ను దరికి రానీయకుండా ముందుకు సాగుతుంది.
ఎన్నో సినిమా ఈవెంట్లలో కూడా సుమ బాగా సందడి చేస్తుంది.ఒక సినిమా ఈవెంట్ లోనే కాదు సినీ సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసే విధానంలో కూడా సుమ చేసే రచ్చ బాగా ఆకట్టుకుంటుంది.
ఇక ఈ మధ్య సుమ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించగా అందులో తనకు సంబంధించిన కామెడీ వీడియోలను, పలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలను అభిమానులను తెగ పంచుకుంటుంది.
అంతేకాకుండా తను ఇంట్లో చేసే అల్లరి పనులను కూడా తెగ షేర్ చేస్తుంది.కేవలం ఒక్క ఛానల్ లోనే కాకుండా అన్ని ఛానల్ లో సుమ ఆల్ రౌండర్ గా నిలిచింది.తనకున్న ఎనర్జీ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వకుండా ఉండలేరు.
ఇప్పటికీ సుమ అందంలో కూడా ఎటువంటి మార్పు లేదు.ఎవరైనా కౌంటర్ వేస్తే చాలు వెంటనే వాళ్లకు రివర్స్ కౌంటర్ వేసి వారి నోటికి తాళం వేసేలా చేస్తుంది.
ఇక సుమ ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే.ఈ మధ్య ఇన్ స్టా లో కూడా తెగ రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.అప్పుడప్పుడు తను దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటూ ఉంటుంది.ఇక ఈ వయసులో కూడా సుమ చాలా యంగ్ గా కనిపిస్తుంది.
ఇప్పటికి కూడా సుమ ఎనర్జీని చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతూనే ఉంటారు.
ఇదిలా ఉంటే తాజాగా తను దిగిన ఫోటోను తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది.అందులో తను చాలా అందంగా కనిపించడంతో.ఆ ఫోటోను చూసిన నెటిజన్స్ తెగ లైకులు కొడుతున్నారు.
ఇప్పటికీ ఇంత అందంగా ఉన్నారు ఏంటి అని ప్రశ్నలు వేస్తున్నారు.ఓ నెటిజన్ మాత్రం సుమ గారు మీ వయసు ఎంత అండి.20 యేనా అని అడగగా ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.మొత్తానికి సుమకు మేకప్ అందాలతో మాత్రం పదహారేళ్ల అమ్మాయిల్లా కూడా కనిపించే సత్తా ఉందని చెప్పవచ్చు.
ఇక ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ ఉంది సుమ.