ఏంటి పుష్ప ఇలా చేశావ్.. ఓటీటీలో ఆ కట్ చేసిన సీన్ అవసరమా?

తగ్గేదేలే అనే ఒకే ఒక్క డైలాగ్ తో అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప సినిమాపై అంచనాలను పెంచేశారు.మాస్ ప్రేక్షకుల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ తో ఆ ఫాలోయింగ్ ను మరింత పెంచుకున్నారు.

 Negative Comments About Pushpa Movie Ott Scene Details, Allu Arjun, Pushpa, Rash-TeluguStop.com

ఏపీ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పుష్ప ది రైజ్ భారీగా లాభాలను సొంతం చేసుకుంది.ఈ సినిమా ద్వారా నష్టపోయిన బయ్యర్లను సైతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఆదుకుంటున్నారని తెలుస్తోంది.

మరోవైపు నిన్న రాత్రి నుంచి ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పుష్ప సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.ఇప్పటికే థియేటర్లలో పుష్ప సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం ఓటీటీలో మళ్లీ పుష్ప సినిమాను చూస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా అన్ని భాషల హక్కుల కోసం ఏకంగా 27 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసిందని తెలుస్తోంది.

అయితే పుష్ప సినిమా విడుదలైన సమయంలో ఈ సినిమాలోని ఒక సన్నివేశం గురించి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.

Telugu Allu Arjun, Amazon Prime, Pushpa, Pushpa Scene, Pushpa Ott-Movie

సుకుమార్ సినిమా నుంచి ఇలాంటి సీన్ ను ఊహించలేదని ఆడియన్స్ కామెంట్లు చేశారు.అల్లు అర్జున్ రష్మిక భుజంపై చెయ్యి వేసే సీన్ అశ్లీలంగా ఉందని కామెంట్లు వ్యక్తం కావడంతో థియేటర్లలో ఆ సీన్ ను కట్ చేశారు.అయితే అమెజాన్ ప్రైమ్ లో మాత్రం ఈ సీన్ ఉండటం గమనార్హం.

Telugu Allu Arjun, Amazon Prime, Pushpa, Pushpa Scene, Pushpa Ott-Movie

ఈ సీన్ వల్ల బన్నీ, రష్మిక, సుకుమార్ లపై ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్లు వచ్చే ఛాన్స్ ఉంది.ప్రైమ్ లో కూడా ఈ సీన్ ను తొలగిస్తే బాగుంటుందని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.పుష్ప మేకర్స్ ఈ దిశగా చర్యలు చేపడతారో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube