చదువు కోసం నగలు అమ్మిన యువతి.. కట్ చేస్తే ఆలిండియా ర్యాంక్.. ఈ యువతి సక్సెస్ కు గ్రేట్ అనాల్సిందే!

దేశంలోని 40 శాతం మంది విద్యార్థులు ఆర్థిక సమస్యల వల్ల చదువు విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.గత కొన్నేళ్లలో ఫీజులు ఊహించని స్థాయిలో పెరగడంతో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

 Neet Ranker Rithika Success Story Details Here Goes Viral In Social Media , Neet-TeluguStop.com

ఫీజులు పెరుగుతున్న స్థాయిలో తమ ఆదాయం పెరగడం లేదని చాలామంది చెబుతున్నారు.అయితే ఒక యువతి మాత్రం చదువు కోసం నగలు అమ్మి కెరీర్ పరంగా సక్సెస్ సాధించింది.

2021 సంవత్సరంలో నీట్ పరీక్షలో పాసైన చాలామంది విద్యార్థులలో మోలార్ బండ్ ( Molar bund )లోని రితిక కూడా ఒకరు.ఎలాంటి కోచింగ్ లేకుండా రితిక( Ritika ) సొంతంగా ప్రిపేర్ అయ్యి మెరిట్ ర్యాంక్ సాధించారు.

బదర్ పూర్ ( Badarpur )లోని చిన్న ఇంట్లో రితిక తన పేరెంట్స్, ఇద్దరు బ్రదర్స్ తో కలిసి జీవించేవారు.రితిక తండ్రి ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ జీవనం సాగించేవారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో రితిక తండ్రి జాబ్ కోల్పోయారు.ఆ సమయంలో రితిక కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవించింది.

రితిక ఫోన్ లో ఇంటర్నెట్ కూడా లేదు.పుస్తకాలు, ఆండ్రాయిడ్ ఫోన్ కోసం రితిక ఇంట్లో దాచిన నగలను అమ్మేశారు.

ఆ నగలు తన పెళ్లి కోసం దాచిన నగలు కావడం గమనార్హం.ఎన్నో కష్టాలను ఎదుర్కొని రితిక నీట్ పరీక్షలో 500 మార్కులతో 3032 ర్యాంకును సాధించారు.

Telugu Badarpur, Molar Bund, Neetranker, Rithika, Ritika, Story-Latest News - Te

కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేకపోయినా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.యూట్యూబ్ క్లాసులు, కొన్ని పుస్తకాల సహాయంతో ఎంతో కష్టపడి పరీక్షలకు ప్రిపేర్ అయ్యానని ఆమె కామెంట్లు చేశారు.తన సక్సెస్ స్టోరీతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన రితిక గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.రితిక రాబోయే రోజుల్లో తన లక్ష్యాలను సాధించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube