నాని( Nani ) ) హీరో గా సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) హీరోయిన్ గా నటించిన హాయ్ నాన్న మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రేపు ఈ సినిమా ను విడుదల చేయబోతున్న చిత్ర యూనిట్ సభ్యులకు పాజిటివ్ బజ్ దక్కింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గత రెండు రోజులుగా మల్టీప్లెక్స్ ల్లో సినిమా ఓ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వసూళ్లు సాధిస్తోందట.హాయ్ నాన్న విడుదల అయిన ఒక్క రోజు తర్వాత నితిన్ సినిమా కూడా రాబోతుంది.
ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేసే అవకాశాలు కనిపించడం లేదు అంటూ మీడియా సర్కిల్స్ వారు అంటున్నారు.
అడ్వాన్స్ బుకింగ్ విషయం లో రెండు సినిమా లను పోల్చితే నాన్న దే పై చేయి అన్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.హాయ్ నాన్న( Hi Nanna ) సినిమా కు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.ముఖ్యంగా సినిమా ట్రైలర్ విడుదల అయిన తర్వాత ఎప్పుడెప్పుడు సినిమా ను చూస్తామా అంటూ కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అందుకు తగ్గట్లుగా సినిమా ఉంటుంది అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.మొత్తానికి హాయ్ నాన్న సినిమా( Hi Nanna ) భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతుంది.
కనుక భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకోబోతుంది.సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టింది.
నాని సినిమా మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఉంటుంది.కనుక ఈ సినిమా కచ్చితంగా నాని కి మంచి పేరు తెచ్చి పెడుతుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.
హాయ్ నాన్న సినిమా ( Hi Nanna )కు ముందు నాని భారీ కమర్షియల్ హిట్స్ అందుకోవడం లో విఫలం అయ్యాడు.దసరా సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో ఆకట్టుకుంటాను అన్నాడు.కానీ ఆ సినిమా నిరాశనే మిగిల్చిన విషయం తెల్సిందే.ఇప్పుడు హాయ్ నాన్న సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వబోతుంది.మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.