యూఎస్ లో సాలిడ్ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన 'అంటే సుందరానికి'!

నేచురల్ స్టార్ నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 Nani Ante Sundaraniki Usa Premieres Details, Usa, Usa Premieres, Ante Sundaranik-TeluguStop.com

ఈ సినిమా నాని కెరీర్ లో మరొక మైలు రాయిలాగా నిలిచి పోయింది.ఈ సినిమా ఇచ్చిన విజయం తర్వాత నాని ‘అంటే సుందరానికి’ సినిమా స్టార్ట్ చేసి వేగంగా పూర్తి చేసాడు.

ఈ సినిమా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కింది.

రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రొమోషన్స్ బాగా చేస్తూ ఈ సినిమాపై మరింత హైప్ పెంచేశారు.

ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు.ఇది బాగా ఆకట్టు కుంది.ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించే సినిమా నాని నుండి మరొకటి రాబోతుంది అని ఫ్యాన్స్ అంతా సంతోషంగా ఉన్నారు.ఇక ఎట్టకేలకు ఈ సినిమా జూన్ 10న రిలీజ్ అవ్వనుంది.

ఇందులో నాని కి జోడీగా నజ్రియా ఫహద్ నటించింది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా వివేక్ సాగర్ సంగీతం అందించారు.

Telugu Antesundaraniki, Naniante, Natural Nani, Nazriya Fahad, Usa Box, Usa, Viv

తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.ఈ సినిమాలో నాని డిఫెరెంట్ పాత్రలో నటించాడు.ఇక ఇప్పటికే యుఎస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ పడిపోయాయి.

Telugu Antesundaraniki, Naniante, Natural Nani, Nazriya Fahad, Usa Box, Usa, Viv

మరి ముందు నుండి పాజిటివ్ బజ్ ఏర్పడడం వల్ల యుఎస్ లో ఈ సినిమా మంచి స్టార్టింగ్ తో స్టార్ట్ అయ్యింది.యుఎస్ బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా ప్రీమియర్స్ తోనే 2 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి అదరగొట్టింది అనే చెప్పాలి.

మరి పాజిటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ లో మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.చూడాలి మరి నాని అంటే సుందరానికి సినిమాతో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube