ఆ వ్యాధితో బాధపడుతున్న నందిత శ్వేత... అందుకే ఇలా...

సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది చాలా సినిమాలు చేస్తూ హీరోయిన్స్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తుంటే అందులో చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడ హీరోయిన్స్ గా నిలబడుతూన్నారు.ఇక అలాంటి కోవలోకి వచ్చే హీరోయినే నందిత శ్వేత( Nandita Swetha ) …ప్రతి సినిమాకి ఒక ఒకప్పుడు సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె అనుకోకుండా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది.

 Nandita Shweta Who Is Suffering From That Disease That's Why, Nanditha Swetha ,-TeluguStop.com

ఇదిలా ఉండగా ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఏ విషయాన్ని కూడా దాచుకోవడం లేదనే చెప్పాలి.దాపరికాలు లేకుండా ప్రతి విషయాన్ని కూడా పబ్లిక్ చేస్తున్నారు.

ముఖ్యంగా అభిమానులతో పంచుకుంటూ ఒకరకంగా కొంత మానసిక బరువును కూడా తగ్గించు కుంటున్నారనే చెప్పాలి.

 Nandita Shweta Who Is Suffering From That Disease That's Why, Nanditha Swetha ,-TeluguStop.com
Telugu Fibromyositis, Problem, Muscle Disorder, Nandita Shweta, Nanditha Swetha-

గతంలో లాగా వ్యక్తిగత రహస్యాలు పంచుకుంటే ఏమవుతుందో అని భయాలు తొలగించి.ధైర్యంగా ముందుకు వస్తున్నారు.ముఖ్యంగా అభిమానులలో కూడా వచ్చిన అవేర్నెస్ ఈ ధైర్యానికి ఒక కారణమని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే నందిత శ్వేతా కూడా తాను ఇంతలా బరువు పెరగడానికి గల కారణాన్ని కూడా వెల్లడించింది.అసలు విషయంలోకెళితే సమంత లాగే నందిత కూడా అనారోగ్య సమస్యని ఎదుర్కొన్నానని వెల్లడించింది.

ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలా సన్నగా కనిపించిన ఈమె కొన్ని నెలలకి లావు అయిపోయింది.అయితే ఈమెను చూసిన వారంతా ఒళ్ళు చేయడం సహజం కాబట్టి అలాగే బరువు పెరిగిందని అనుకున్నారు.

కానీ దీని వెనుక ఉన్న ఒక అనారోగ్య సమస్య( health problem ) గురించి వెల్లడించింది.

Telugu Fibromyositis, Problem, Muscle Disorder, Nandita Shweta, Nanditha Swetha-

నందిత శ్వేతా మాట్లాడుతూ నాకు ఫైబ్రోమయోజియా( Fibromyositis ) అనే కండర రుగ్మత ఉంది.అందుకే ఎక్కువ డైట్ పాటిస్తూ భారీ వ్యాయామాలు చేయడం సాధ్యం కాదు.ఇక మితిమీరిన ఒత్తిడి, సరిగా నిద్ర లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఇది మరింత తీవ్రతరం అవుతుంది.

ఆ కారణంగా బరువు పెరిగిపోతాము…మళ్లీ ఆ ఒళ్ళు తగ్గించడం అంత సులభమైన పని ఏమీ కాదు.ఇది వెన్నెముక కండరాలకు సంబంధించిన సమస్య ఉన్నట్టుండి నీరసం రావడం, బ్రెయిన్ నొప్పిని గ్రహించలేకపోవడం వంటివి ఈ రుగ్మత లక్షణాలు… క్రమం తప్పకుండా వ్యాయామాలు, డైట్ చేస్తేనే మన ఆధీనంలో ఉంటుంది అంటూ ఆమె తెలిపింది.

ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం ఈమె హిడింబ అనే సినిమాలో నటించింది ఇంకో 4 రోజుల్లో ఆ సినిమా రిలీజ్ కి రెడీ గా అవుతుంది…ఇక ఈ సినిమా తో పాటు గా ఆమె చేసే ఇంకా కొన్ని సినిమాలు కూడా సెట్స్ మీద ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube